English   

క‌న్న‌డ హీరోల‌తో క‌నెక్షన్ ఏంటి శిరీష్..?

Puneeth-Rajkumar-Special-Bond-With-Allu-Sirish

మెగా హీరోల‌కు క‌ర్ణాట‌క‌తోనూ విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. మెగా హీరోలంద‌రికి క‌న్న‌డ‌నేల‌పై మంచి ఇమేజ్ ఉంది. చిరు, ప‌వ‌న్ లాంటి హీరోల‌కైతే అక్క‌డ గుళ్లు క‌ట్టేంత అభిమానులు ఉన్నారు. ఇదే నెక్ట్స్ జ‌న‌రేష‌న్ కూడా కొన‌సాగిస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌న్న‌డ హీరోల‌తో క‌నిపిస్తున్నాడు. ఈయ‌న మొన్న శివ‌రాజ్ కుమార్ న‌టిస్తోన్న ఠ‌గురు టీజ‌ర్ లాంచ్ కు వెళ్లాడు. ఇప్పుడేమో శిరీష్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న సెట్ కు పునీత్ రాజ్ కుమార్ వ‌చ్చాడు. అస‌లు విష‌యం ఏంటంటే ఇప్పుడు శిరీష్ సినిమా షూటింగ్ బెంగ ళూర్ లో జ‌రుగుతుంది. అందుకే వ‌ర‌స‌గా క‌న్న‌డ హీరోల‌తో క‌నిపిస్తున్నాడు శిరీష్.

అల్లు శిరీష్ ప్ర‌స్తుతం విఐ ఆనంద్ తో సినిమా చేస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఓ వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త నేప‌థ్యంతో ఈ చిత్రం వ‌స్తుందంటున్నాడు ఆనంద్. దీనికి ఒక్క క్ష‌ణం అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. క‌థ కూడా అంతే ఆస‌క్తిగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ టైటిల్ బాగుంటుంద‌ని ఫీల్ అవుతున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర షూటింగ్ బెంగ‌ళూర్ లో జ‌రుగుతుంది. మొత్తానికి ఈ ఒక్క క్ష‌ణం త‌న కెరీర్ ను మ‌లుపు తిప్పుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడు ఈ అల్లువార‌బ్బాయి. ప‌నిలో ప‌నిగా త‌న సినిమా కోసం క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకునే ప‌నిలో బిజీగా ఉన్నాడు ఈ అల్లు వార‌బ్బాయి. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

More Related Stories