English   

శ‌ర్వానంద్ బాట‌లో రాజ్ త‌రుణ్

sharwanand-rajtarun

మొన్న‌టి వ‌ర‌కు అస‌లు ఊసే లేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు మాత్ర‌మే వ‌స్తున్నాయ‌ని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అనుకోకుండా రేస్ లోకి చిన్న సినిమా వ‌చ్చింది. అది కూడా రాజ్ త‌రుణ్ ది. అయితే దానివెన‌క మాత్రం పెద్ద హ‌స్తం ఉంది. అదే నాగార్జున‌. అవును.. ఈయ‌న నిర్మిం చిన రంగుల రాట్నం సినిమా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీ‌రంజ‌ని తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. పండ‌గ‌ల‌కు స్టార్ హీరోల‌తో పోటీ ప‌డాలంటే శ‌ర్వానంద్ త‌ర్వాతే ఎవ‌రైనా..? ఈయ‌న వ‌చ్చాడంటే స్టార్స్ కు వ‌ణుకు మొద‌లైపోతుంది. ఇప్పుడు ఇదే రూట్ రాజ్ త‌రుణ్ ఫాలో అవుతున్నాడు. 

సంక్రాంతికి ప‌వ‌న్, బాల‌య్య లాంటి స్టార్స్ ఉన్నా కూడా ఇప్పుడు రంగుల రాట్నం అంటున్నాడు ఈ కుర్ర హీరో. నాగార్జున ఈ చిత్రాన్ని 4 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి నిర్మించాడు. ఉయ్యాలా జంపాల సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిందే నాగార్జున‌. ఇప్పుడు మ‌రోసారి రాజ్ త‌రుణ్ తో సినిమా నిర్మిస్తున్నాడు కింగ్. రంగుల రాట్నంపైనే రాజ్ త‌రుణ్ ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ క‌థ ప్ర‌కారం మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. ఆ త‌ర్వాత అస‌లు క‌థ ఎలా మ‌లుపులు తిరిగింది అనేది అస‌లు క‌థ‌. మా అబ్బాయి ఫేమ్ చిత్రాశుక్లా హీరోయిన్. మొత్తానికి స్టార్స్ తో పోటీలో ఈ రంగుల రాట్నం ర‌చ్చ ఎలా ఉంటుందో చూడాలిక‌..!

More Related Stories