English   

స‌న్నీలియోన్ రేంజ్ ఏంది సామి..?

Sunny-Leone

స‌న్నీలియోన్ అనే పేరు విన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే ముందుగా గుర్తొచ్చేది అందాల ఆర‌బోత. కేవ‌లం అందుకోస‌మే ఈమెను సినిమాలో తీసుకుంటారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్రేక్ష‌కులు కూడా అది చూడ్డానికే ఇష్ట‌ప‌డ‌తారు. ఇన్నాళ్లూ స‌న్నీ అంటే అందాల బొమ్మంతే. కానీ ఈమెలోనూ ఓ న‌టి ఉంద‌ని కొంద‌రు గుర్తించారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 150 కోట్ల‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అది చూసి అంతా షాక‌వుతున్నారు. ఈ సినిమాకు వీర‌మ‌హాదేవి అనే టైటిల్ కూడా పెట్టారు. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం డేట్స్ కూడా ఇచ్చేసింది స‌న్నీ. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం ఈమె అందుకుంటున్న పారితోషికం చూస్తే క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. అక్ష‌రాలా 3.5 కోట్లు ఈ చిత్రం కోసం అందుకుంటుంది స‌న్నీలియోన్. మొన్న‌టికి మొన్న గ‌రుడ‌వేగ‌లో చేసిన ఐటం సాంగ్ కోస‌మే 50 లక్ష‌ల‌కు పైగా తీసుకుంది. ఇప్పుడు సినిమా అంటే ఆ మాత్రం తీసుకోవ‌డంలో ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. విసి వడివుడియన్ తెర‌కెక్కించనున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాలంలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. అంతేలెండి.. స‌న్నీ ఉన్న‌పుడు భాష‌తో ప‌నిలేదక్క‌డ‌. 2018 ఫిబ్ర‌వ‌రి నుంచి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి స‌న్నీలియోన్ తో చేస్తోన్న ఈ సాహసం ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

More Related Stories