English   

గోపీచంద్ కు ఆక్సీజ‌న్ అందుతుందా..?

Will-Gopichand-Get-Success-With-Oxygen

మ‌నం బ‌త‌కాలంటే ఆక్సీజ‌న్ త‌ప్ప‌నిస‌రి. అది లేక‌పోతే మ‌నుషులు చ‌చ్చిపోతారు. అలాగే సినిమాల్లోనూ విజ‌యాలు త‌ప్ప‌నిస‌రి. అదే ఆక్సీజ‌న్ హీరోల‌కు. ఇప్పుడు గోపీచంద్ కెరీర్ కు ఈ ఆక్సీజ‌న్ కావాలి. లౌక్యం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపీచంద్ కెరీర్ బాగా పీక్స్ కు వెళ్లింది. కానీ త‌ర్వాత జిల్, సౌఖ్యం ఫ్లాపుల‌తో దెబ్బ‌కు దిగిపోయింది బాబు గారి ఇమేజ్. ముఖ్యంగా సౌఖ్యం మ‌రీ దారుణంగా ఉండ‌టంతో.. గోపీ స్టోరీ సెలక్ష‌న్ పై కూడా విమ‌ర్శ‌లొచ్చాయి. పైగా ఈ మ‌ధ్యే విడుద‌లైన గౌత‌మ్ నందా కూడా ఫ్లాప్ అయింది. దాంతో ఇలాంటి టైమ్ లో మ‌రో రొటీన్ క‌థ చేస్తే గోపీ ఇమేజ్ మ‌రింత దెబ్బ‌తిన‌డం ఖాయం. అందుకే ప్ర‌యోగం చేస్తున్నాడు ఈ హీరో.

ఈయ‌న న‌టించిన ఆర‌డుగుల బుల్లెట్ ఇప్ప‌ట్లో రాన‌ట్లే. వీటితో పాటు ఆక్సీజ‌న్ అనే సినిమా చేస్తున్నాడు. ఏఎం ర‌త్నం త‌న‌యుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అప్పుడెప్పుడో పుష్క‌రం కింద త‌రుణ్ తో నీ మ‌న‌సు నాకు తెలుసు లాంటి ఫ్లాప్ తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు గోపీచంద్ కు ఏ క‌థ చెప్పి ప‌డేసాడో తెలియ‌దు గానీ మొత్తానికి ప‌డేసాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. చాలా కాలంగా విడుద‌ల‌కు నోచుకోని ఈ చిత్రం అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రాశీఖ‌న్నా, అను ఎమ్మాన్యుయ‌ల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని తొలి పాట విడుద‌లైంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని సోల్ ఆఫ్ తెలుగు పాట విడుద‌లైంది. మ‌రి సినిమా గోపీచంద్ కెరీర్ కు ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతుందో చూడాలిక‌..!

More Related Stories