English   

మాస్టర్ సినిమా విడుదల చేయొద్దు.. సీఎంకు లేఖ రాసిన దర్శకుడు..

 Thalapathy Vijay
2020-06-06 06:58:55

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాస్టర్. దీనిపై రెండు భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ ఈ సినిమా రైట్స్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ దాదాపు 11 కోట్లకు కొనుగోలు చేసింది. పరిస్థితులు బాగుండి ఉంటే ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల అయి ఉండేది. కానీ కరోనా వైరస్ కారణంగా మాస్టర్ సినిమా వాయిదా పడింది. మధ్యలో ఓ టి టి రిలీజ్ అనే టాక్ వినిపించినా కూడా అది వర్కవుట్ కాదని నిర్మాతలు చెప్పేశారు. దాంతో థియేటర్లు తెలుసుకున్న వెంటనే మాస్టర్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో తమిళ సీనియర్ దర్శక నిర్మాత కె ఆర్ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. పెరుగుతున్న కరోనా వైరస్ కేసులని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ సినిమాను విడుదల కాకుండా ఆపాలంటూ ఆయన కోరాడు. ఇప్పటికే తమిళనాడులో దాదాపు 25 వేలకు కరోనా కేసులు చేరుకున్నాయి. ఒకవేళ ఈ సినిమా విడుదలైతే కచ్చితంగా వేలాది సంఖ్యలో థియేటర్లకు అభిమానులు వస్తారు. ప్రస్తుతం విజయ్ తమిళ్ నెంబర్ వన్ హీరో.. ఇలాంటి హీరో సినిమాకు వచ్చే అభిమానులను మనం కంట్రోల్ చేయలేం.. అలాంటప్పుడు కరోనా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. అందుకే మాస్టర్ సినిమా విడుదల కావడానికి అనుమతులు ఇవ్వద్దు అంటూ ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశాడు. ఒకవేళ నిజంగా మాస్టర్ సినిమా విడుదలైతే అప్పుడు చెడ్డ పేరు వచ్చేది విజయ్ కే అంటూ ఆయన లెటర్ చివర్లో రాయడం గమనార్హం. లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. మరి చూడాలిక కరోనా వైరస్ ను దాటుకుని మాస్టర్ ఎప్పుడు విడుదల కానుందో..

More Related Stories