English   

లవ్ స్టొరీ రిలీజ్ డేట్ ఫిక్స్

Love Story
2021-01-26 08:23:47

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా "లవ్ స్టొరీ". ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు క్లాసిక్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్పీ, అమిగోస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాను తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. దాంతో సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ను నిజామాబాద్ లోని ఆర్మూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టీజర్లో నాగ చైతన్య తెలంగాణ యాసలో అదరగొడుతున్నాడు. ఇక ఇప్పటికే ఫిదా సినిమాతో సాయి పల్లవి తెలంగాణ యువతి లా అలరించింది. ఈ సినిమాలో కూడా దాదాపు సాయి పల్లవి అదే లుక్ లో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 16న సినిమాను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. సినిమా డేట్ తో పాటూ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో చైతన్య, సాయి పల్లవి కలిసి జంటగా పతంగ్ ను ఎగరవేస్తున్నారు. ఇక హాట్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "లవ్ స్టోరీని" ప్రేక్షకులు కూల్ గా ఎంజాయ్ చేయాలని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

More Related Stories