English   

 ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో..

Lover-Also-Fighter-Also

ఇప్ప‌టి వ‌ర‌కు నా పేరు సూర్య అంటే కంప్లీట్ యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమానే. ఇందులో ప్రేమ గీమా లాంటివి ఏవీ ఉండవేమో అనేంత‌గా ద‌ర్శ‌కుడు త‌న క‌థ‌తో బిల్డ‌ప్ ఇచ్చాడు. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌లు కానీ.. టీజ‌ర్ కానీ చూస్తుంటే ఇందులో అస‌లు ప్రేమ అనేది ఉందా అనిపిస్తుంది. అలాంటిదిప్పుడు వాలెంటైన్ డే రోజు త‌న ప్రేమ ఎంత ఉందో చూపించాడు సూర్య‌. త‌న‌లోని ప్రేమ మొత్తాన్ని మూట‌గ‌ట్టి ప్రేక్ష‌కుల‌కు కానుక‌గా అందించాడు. విశాల్ శేఖ‌ర్ స్వ‌ర‌ప‌రిచిన నా పేరు సూర్య రెండో పాట విడుద‌లైంది. ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో అంటూ సాగే ఈ పాట‌లో అను ఎమ్మా న్యువ‌ల్ అద్భుతంగా క‌నిపిస్తుంది. ఆమె కంటిచూపుల‌కు ప‌డిపోనివాడు ఒక్క‌డు కూడా ఉండ‌డేమో..? అంత‌గా మ‌త్తెక్కించే చూపుల‌తో మాయ చేస్తుంది అను. సైనికాలో దేశ‌భ‌క్తి క‌నిపిస్తుంటే.. ఈ పాట‌లో ప్రేమ త‌త్వం బాగా భోద‌ప‌డింది. ఓ సోల్జ‌ర్ ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుందో.. లిరిక్స్ కూడా అలాగే రాయించుకున్నాడు వ‌క్కంతం వంశీ. స‌రిహ‌ద్దులు తెంచుకుని నీ వ‌ద్ద‌కు రానా అంటూ ప్రేయ‌సిని ఉద్దేశించి పాడుతున్నాడు బ‌న్నీ. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర క్లైమాక్స్ పోర్ష‌న్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఎప్రిల్ 26న సినిమా విడుద‌ల కానుంది. 

More Related Stories