English   

ల‌వ‌ర్ ప్రివ్యూ.. టెన్ష‌న్ లో రాజు..!

Raj-tarun
2018-07-19 16:36:45

దిల్ రాజు సినిమా అంటే మ‌రో మాట లేకుండా హిట్ అని అర్థం. ఆయ‌న చేయి పడిందంటే రాయి కూడా బంగారం కావాల్సిందే. ప్లాప్ హీరోకు కూడా హిట్ రావాల్సిందే. క‌థ‌పై క‌మాండ్ అలా ఉంటుంది ఈయ‌న‌కు. హిట్ కావాల్సిన వాళ్ల‌కు సరైన టైమ్ లో ఇస్తుంటాడు ఈ నిర్మాత‌. ర‌వితేజ‌కు కూడా రాజా ది గ్రేట్ తో హిట్ ఇచ్చాడు. వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్న ఈ నిర్మాత ఇప్పుడు టెన్ష‌న్ లో ఉన్నాడు. త‌న విజ‌యాల‌కు ఎక్క‌డ బ్రేక్ ప‌డుతుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నాడు. అయితే అంత‌గా టెన్ష‌న్ పెడుతున్నాడు ల‌వ‌ర్. ఈ సినిమా జులై 20 న విడుద‌ల కానుంది. తెలిసో తెలియ‌కో  రాజ్ త‌రుణ్ ఇమేజ్ ను బాగానే దెబ్బ తీస్తున్నారు రాజుగారు. 

ఇప్పుడు రాజ్ త‌రుణ్ కు వ‌ర‌స ప్లాపులు వ‌స్తున్నాయ‌ని.. 4 కోట్లు కూడా మార్కెట్ లేని హీరోతో తాను 8 కోట్లు పెట్టి సినిమా తీసాన‌ని.. రిస్క్ అని తెలిసినా త‌న బ్యానర్ నుంచి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కుల‌కు ఆ మేకింగ్ వ్యాల్యూస్ త‌గ్గేలా ఉండ‌కూడ‌ద‌ని సినిమా చేసామ‌ని చెబుతున్నాడు దిల్ రాజు. ఇక రాజ్ త‌రుణ్ తో న‌టించ‌డానికి పెద్ద హీరోయిన్లు ఎవ‌రూ ఒప్పుకోర‌ని.. ఈ హీరో కోసం హీరోయిన్ ను వెత‌క‌డానికి చాలా వెతికాం అని చెప్పాడు దిల్ రాజు. ఇదంతా ఈ కుర్ర హీరోను డీ గ్రేడ్ చేస్తున్న‌ట్లే ఉంది. అయితే రాజ్ త‌రుణ్ కు కూడా ఇప్పుడు పెద్ద‌గా ఛాన్స్ లేదు. ఇలాంటి టైమ్ లో దిల్ రాజు ఆఫ‌ర్ ఇవ్వ‌డ‌మే ఎక్కువ‌. ఆరు వర‌స విజ‌యాల‌తో 2017ను ప‌ర్ ఫెక్ట్ గా ముగించిన దిల్ రాజు.. 2018ని ల‌వ‌ర్ సినిమాతో ఆరంభిస్తున్నాడు. ఈ చిత్రం ఎలా ఉంటుందో అని కంగారు ప‌డుతున్నాడు రాజు గారు. 

More Related Stories