English   

ల‌వ‌ర్.. గుండెల్లో ధ‌డ్ ధ‌డ్..!!

raj tharun

ఇంకా వారం రోజులే.. మ‌రో వారం రోజుల్లో త‌న కొత్త సినిమాతో వ‌స్తున్నాడు రాజ్ త‌రుణ్. ఈ మ‌ధ్య కాలంలో అస‌లు ఈయ‌న సినిమాలు వ‌చ్చి వెళ్తున్న‌ట్లు కూడా తెలియ‌డం లేదు. క‌నీసం కోటి రూపాయ‌ల షేర్ కూడా తీసుకురాకుండానే వెనుదిరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ల‌వ‌ర్ వ‌స్తున్నాడు. టీజ‌ర్ రొటీన్ గానే ఉంది కానీ ప‌ర్లేదు. ఎందుకంటే రాజ్ త‌రుణ్ గ‌త సినిమాలు ఇంత‌కంటే త‌క్కువ అంచ‌నాల‌తో వ‌చ్చాయి కాబ‌ట్టి.. ఇది దిల్ రాజు బ్యాన‌ర్ లో వ‌స్తుంది కాబ‌ట్టి. ఇండ‌స్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ ఎవ‌రిదైనా ఉందా అంటే.. మ‌రో మాట లేకుండా చెప్పే పేరు దిల్ రాజు. హిట్ కావాల్సిన వాళ్ల‌కు సరైన టైమ్ లో ఇస్తుంటాడు ఈ నిర్మాత‌. ర‌వితేజ‌కు కూడా రాజా ది గ్రేట్ తో హిట్ ఇచ్చాడు. వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్న ఈ నిర్మాత టెన్ష‌న్ లో ఉన్నాడు. త‌న విజ‌యాల‌కు ఎక్క‌డ బ్రేక్ ప‌డుతుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నాడు. దానికి కార‌ణం రాజ్ త‌రుణ్. ఈ కుర్ర హీరోతో ఇప్పుడు ఈయ‌న ల‌వ‌ర్ సినిమా నిర్మించాడు. 

వర‌స విజ‌యాల‌తో 2017ను ప‌ర్ ఫెక్ట్ గా ముగించిన దిల్ రాజు.. 2018ని ల‌వ‌ర్ సినిమాతో ఆరంభిస్తున్నాడు. ఈ చిత్రం ఎలా ఉంటుందో అని కంగారు ప‌డుతున్నాడు రాజు గారు. మ‌రోవైపు రాజ్ త‌రుణ్ బ్యాడ్ ల‌క్ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడు. మొన్న సంక్రాంతికి స్టార్ హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌చ్చిన రంగుల రాట్నం కూడా డిజాస్ట‌రే. ఇవ‌న్నీ మ‌రిచిపోయి ఇప్పుడు హ్యాపీగా కామెడీతో నెట్టుకొద్దాం అనుకుని రాజుగాడు అంటూ వ‌చ్చాడు రాజ్ త‌రుణ్. సంజ‌నారెడ్డి ద‌ర్శ‌కురాలు. ఇది అంతే అయింది. దాంతో రాజ్ త‌రుణ్ కెరీర్ ఇప్పుడు కుడితిలో ప‌డ్డ ఎల‌క‌లా మారిపోయింది. ఈ కుర్రాడికి ఇప్పుడున్న‌ది ఒక‌టే దారి.. అదే ల‌వ‌ర్. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో కాస్త కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రాజ్ త‌రుణ్. అనీల్ కృష్ణ దీనికి ద‌ర్శకుడు. కానీ దిల్ రాజు మాత్రం టెన్ష‌న్ ప‌డుతున్నాడు. మ‌రి చూడాలి ఈ చిత్రంతో అయినా రాజ్ త‌రుణ్ జాత‌కం మారుతుందో లేదో..? ఈ చిత్రం జులై 20న విడుద‌ల కానుంది. 

More Related Stories