English   

ల‌వ‌ర్ టీజ‌ర్.. ఓవ‌ర్ యాక్ష‌న్ గురూ..!

Lover-teaser
2018-06-30 10:19:31

అయ్యోరామా.. ఇది మ‌నం అంటున్న మాట కాదు.. ల‌వ‌ర్ టీజ‌ర్ లో రాజ్ త‌రుణ్ ను చూసి వాళ్లే అంటున్నారు. ఈ క‌మెంట్ కు మ‌న‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న ఈ కుర్ర హీరో త‌న ఓవ‌ర్ యాక్ష‌న్ తో అయినా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. అస‌లు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు విడుద‌లైన ల‌వ‌ర్ టీజ‌ర్ కూడా రొటీన్ గానే ఉంది కానీ ప‌ర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్ త‌రుణ్ గ‌త సినిమాలు ఇంత‌కంటే త‌క్కువ అంచ‌నాల‌తో వ‌చ్చాయి కాబ‌ట్టి.. ఇది దిల్ రాజు బ్యాన‌ర్ లో వ‌స్తుంది కాబ‌ట్టి. ఇండ‌స్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ ఎవ‌రిదైనా ఉందా అంటే.. మ‌రో మాట లేకుండా చెప్పే పేరు దిల్ రాజు. హిట్ కావాల్సిన వాళ్ల‌కు సరైన టైమ్ లో ఇస్తుంటాడు ఈ నిర్మాత‌. ర‌వితేజ‌కు కూడా రాజా ది గ్రేట్ తో హిట్ ఇచ్చాడు. వ‌ర‌స విజ‌యాలు అందుకుంటున్న ఈ నిర్మాత టెన్ష‌న్ లో ఉన్నాడు. త‌న విజ‌యాల‌కు ఎక్క‌డ బ్రేక్ ప‌డుతుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నాడు. దానికి కార‌ణం రాజ్ త‌రుణ్. ఈ కుర్ర హీరోతో ఇప్పుడు ఈయ‌న ఓ సినిమా నిర్మిస్తున్నాడు. 

ఆరు వర‌స విజ‌యాల‌తో 2017ను ప‌ర్ ఫెక్ట్ గా ముగించిన దిల్ రాజు.. 2018ని ల‌వ‌ర్ సినిమాతో ఆరంభిస్తున్నాడు. ఈ చిత్రం ఎలా ఉంటుందో అని కంగారు ప‌డుతున్నాడు రాజు గారు. మ‌రోవైపు రాజ్ త‌రుణ్ బ్యాడ్ ల‌క్ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నాడు. మొన్న సంక్రాంతికి స్టార్ హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌చ్చిన రంగుల రాట్నం కూడా డిజాస్ట‌రే. ఇవ‌న్నీ మ‌రిచిపోయి ఇప్పుడు హ్యాపీగా కామెడీతో నెట్టుకొద్దాం అనుకుని రాజుగాడు అంటూ వ‌చ్చాడు రాజ్ త‌రుణ్. సంజ‌నారెడ్డి ద‌ర్శ‌కురాలు. ఇప్పుడు విడుద‌లైన ఈ చిత్రం కూడా ప్లాప్ టాక్ నే తెచ్చుకుంది. దాంతో రాజ్ త‌రుణ్ కెరీర్ ఇప్పుడు కుడితిలో ప‌డ్డ ఎల‌క‌లా మారిపోయింది. ఈ కుర్రాడికి ఇప్పుడున్న‌ది ఒక‌టే దారి.. అదే ల‌వ‌ర్. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో కాస్త కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రాజ్ త‌రుణ్. అనీల్ కృష్ణ దీనికి ద‌ర్శకుడు. కానీ దిల్ రాజు మాత్రం టెన్ష‌న్ ప‌డుతున్నాడు. మ‌రి చూడాలి ఈ చిత్రంతో అయినా రాజ్ త‌రుణ్ జాత‌కం మారుతుందో లేదో..? 

More Related Stories