English   

లైకాతో శంక‌ర్ కు వార్..

LYCA production and shankar
2018-02-23 11:28:38

పాపం.. ఓ నిర్మాత ఇంత‌కంటే ఇంకేం చేస్తాడు చెప్పండి. ఒక‌టా రెండా.. అక్ష‌రాలా 450 కోట్లు ఒక్క సినిమాను న‌మ్మి.. ఓ ద‌ర్శ‌కున్ని న‌మ్మి పోసేస్తున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. అదే 2.0 సినిమా. ర‌జినీకాంత్ ఉన్నాడు క‌దా అనే ధైర్యం.. శంక‌ర్ ఉన్నాడు క‌దా అనే న‌మ్మ‌కం.. ఈ రెండు క‌లిపి ఎంత బ‌డ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అయ్యారు లైకా. కానీ ఇప్పుడు ఈ న‌మ్మ‌కాన్ని శంక‌ర్ వ‌మ్ము చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాను నానాటికి లేట్ చేస్తున్నాడు కానీ ఎప్ప‌టికి పూర్తి చేస్తాడో చెప్ప‌డం లేదు ఈ ద‌ర్శ‌కుడు. జ‌న‌వ‌రి 25న రావాల్సిన సినిమా ఎప్రిల్ కు పోస్ట్ పోన్ అయింది. ఎప్రిల్ 27న రావాల్సిన సినిమా కాస్తా ఇప్పుడు ఎప్పుడొస్తుందో తెలియ‌నంత‌గా మారిపోయింది. కార‌ణం అడిగితే టెక్నిక‌ల్ వండ‌ర్ గా వ‌స్తున్న సినిమా క‌దా.. అందుకే ఆల‌స్యం అవుతుందంటున్నాడు శంక‌ర్.

ఇదే స‌మాధానం నిర్మాత‌ల‌కు కూడా చెప్ప‌డం.. తాను క్వాలిటీ విష‌యంలో అస్స‌లు కాంప్ర‌మైజ్ కాన‌ని చెప్ప‌డంతో శంక‌ర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ధ్య చిన్న సైజ్ యుద్ధ‌మే జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుందిప్పుడు. నిజానికి ఈ సినిమా ఎప్రిల్ లో కూడా రాక‌పోవ‌డానికి కార‌ణం శంక‌ర్ క‌మిటైన అమెరిక‌న్ విఎఫ్ఎక్స్ కంపెనీ చెప్పా పెట్ట‌కుండా ఎత్తేయ‌డ‌మే. దాంతో మ‌రో కంపెనీకి ఇప్పుడు 2.0 ప‌నుల‌న్నీ అప్ప‌చెప్పాడు శంక‌ర్. అందుకే ఇంకా లేట్ అవుతుంది ఈ సినిమా. దాంతో నిర్మాత‌ల‌కు టెన్షన్ పెరిగిపోయి శంక‌ర్ ను నిల‌దీసాడ‌ని.. అయితే ఎంత ఆల‌స్యం అయినా కూడా తాను క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాన‌ని శంక‌ర్ క్లాస్ పీకాడ‌ని తెలుస్తుంది. మ‌రి ఈ వార్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో..? ఈ సినిమాకు ఎప్పుడు మోక్షం వ‌స్తుందో చూడాలిక‌..!

More Related Stories