English   

శ్రీ‌రెడ్డిపై మా అసోషియేష‌న్ సీరియ‌స్..

Sri-Reddy
2018-04-09 17:08:50

ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మా అసిసోయేష‌న్ ఇప్పుడు సీరియ‌స్ అయింది. నెల రోజులుగా శ్రీ‌రెడ్డి ఎన్ని చేసినా.. ఎంత‌మంది పేర్లు బ‌య‌ట‌పెట్టినా.. ఎవ‌ర్ని నిందించినా కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు మా. కానీ ఇప్పుడు ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందే బ‌ట్ట‌లిప్పి కూర్చుని ఇండ‌స్ట్రీ ప‌రువు తీసింది ఈ భామ‌. దాంతో శ్రీ‌రెడ్డిపై సీరియ‌స్ అయ్యారు పెద్ద‌లు. మా అసోసియేష‌న్ ప్ర‌త్యేకంగా మీటింగ్ పెట్టి మ‌రీ ఆమెకు ఇక‌పై అవ‌కాశాలు రావ‌ని తేల్చేసారు. వ‌చ్చిన అవ‌కాశాల‌ను కూడా వెన‌క్కి తీసుకోవాల‌ని చెప్పారు. దానికితోడు ఆమెకు జీవితంలో మా అసోసియేష‌న్ కార్డ్ రాద‌ని తేల్చేసారు శివాజీరాజా. ఇవ్వం అని కూడా చెప్పారు. దానికి ఆమె ప్ర‌వ‌ర్త‌నే కార‌ణం అని తేల్చేసారు మా ప్రెసిడెంట్. ఆఫ‌ర్లు వ‌చ్చిన‌పుడు చక్క‌గా న‌టించ‌క‌.. ఇలా చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు వాళ్లు. 

నిజంగా ఆ అమ్మాయికి సినిమాపై ప్రేమ ఉంటే ఇలా చేయ‌దు అని.. తేజ సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింది ఏమో ఆ సినిమాతో క్లిక్ అయ్యేదేమో.. ఆమెకు కావాల్సింది ఆఫ‌ర్లు కాదు ఫ్రీ ప‌బ్లిసిటీ అంటూ మండి ప‌డ్డారు. ఇప్పుడే కాదు.. జీవితంలో ఎప్పుడూ శ్రీ‌రెడ్డికి మా అసోషియేష‌న్ మెంబ‌ర్ షిప్ ఇవ్వ‌మ‌ని చెప్పేసారు. అంతేకాదు.. ఆమెకు అవ‌కాశాలు రావ‌ని.. ఇచ్చిన వాళ్ల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ప‌డు తుంద‌ని పెద‌రాయుడు తీర్పు ఇచ్చేసారు. శ్రీ‌రెడ్డితో న‌టించినా కూడా వాళ్ల‌ను మా నుంచి స‌స్పెండ్ చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చాడు ప్రెసిడెంట్ శివాజీ రాజ‌. దాంతో ఇప్పుడు శ్రీ‌రెడ్డి ఇంకెంత‌గా రెచ్చిపోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. పైగా ఈమెకు తేజ‌తో పాటు మ‌రో ద‌ర్శ‌కుడు కూడా ఆఫ‌ర్ ఇచ్చాడు. వ‌ర్మ కూడా అవ‌కాశం ఇస్తానంటున్నాడు. మ‌రి ఈ ద‌ర్శ‌కుల ప‌రిస్థితి ఏంటి ఇప్పుడు..? వాళ్ల‌ను కూడా మా నుంచి బ‌హిష్క‌రిస్తారా అనేది చూడాలిక‌..!

More Related Stories