English   

రెండు వర్గాలుగా చీలిపోవ‌డ‌..మా..!

maa
2018-04-22 09:38:02

ఇండ‌స్ట్రీలో గ్రూపులు ఉన్నాయ‌ని.. ఎవ‌రికి వాళ్లు స‌ప‌రేట్ గా గ్రూపులు ఫార్మ్ చేసుకుని ఉన్నార‌ని చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కాక‌పోతే దాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసే వాళ్లే లేరు. కాక‌పోతే వాళ్ల‌కు కావాల్సిన ప‌నులు వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఫ‌ర్ ది ఇండ‌స్ట్రీ.. బై ది ఇండ‌స్ట్రీ.. అంటూ గొప్ప‌ల‌కు పోయే మా అసోషియేష‌న్ కూడా ఇప్పుడు రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా కులాల వారిగా చీలింద‌నే వార్త‌లే ఇప్పుడు ఇండ‌స్ట్రీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. క‌మ్మ కాపు వ‌ర్గాల నుంచి చాలా కాలంగా చీల‌క‌లు వ‌స్తూ ఉన్నాయ‌నే వార్త‌లు ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్నవే. మోహ‌న్ బాబు వ‌ర్గం ఓ సైడ్ ఉంటే.. చిరంజీవి వ‌ర్గం మ‌రో వైపు ఉంటుంద‌ని.. మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌రికొంద‌రు కూడా ఉన్నార‌ని తెలుస్తుంది. ఈ క‌మ్మ కాపు కులాల మ‌ధ్య చీల‌క‌ల నుంచి ఇండ‌స్ట్రీ కూడా విచ్ఛిన్నంగా మారిపోయింద‌ని తెలుస్తుంది. 

ఈ రోజు ఇంత పెద్ద స‌మ‌స్య ఎదురుగా ఉన్నా కూడా ఎవ‌రికి వాళ్లు ఇది త‌మ వ‌ర్గానికి కాద‌న్న‌ట్లుగా చేతులు క‌ట్టుకుని కూర్చున్నారు. దాంతో చిలికి చిలికి గాలివాన‌గా మారిపోయింది ఇది. శ్రీ‌రెడ్డి.. క‌త్తిమ‌హేశ్ లాంటి అనామ‌కులు కూడా ఈ రోజు రెండు ర‌ష్ట్రాల్లో తెలిసిన ఫేమ‌స్ ఫేసులు అయిపోయాయి. అదే మా గానీ రెండు వ‌ర్గాలుగా లేకుండా ఒకేతాటిపై ఉండుంటే ఈ రోజు ఇండ‌స్ట్రీలో ఇంత జ‌రుగుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉండేవాళ్లు. ఇంత‌చేసిన శ్రీ‌రెడ్డిపై యాక్ష‌న్ ఎప్పుడో ప‌డుండేది. కానీ ఎవ‌రికి సొంత మాట ఉండ‌దు. వెన‌క ఏ వ‌ర్గం ఉంటుందో.. ఎప్పుడు ఏది స‌పోర్ట్ నిలుస్తుందో.. ఏది వెన‌క్కి నెట్టేస్తుందో తెలియ‌దు. దాంతో పాపం.. మా అసోషియేష‌న్ మాత్రం ఏం చేస్తుంది..?  

More Related Stories