English   

కాజ‌ల్.. త‌మ‌న్నాపై మా ఫైర్..

Kajal-tamanna
2018-02-15 08:16:38

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ళ్లీ హీరోయిన్ల‌పై చిచ్చు ర‌గులుకుంటుంది. అప్ప‌ట్లో పెద్దాయ‌న దాస‌రి ఉన్న‌పుడు ప్ర‌తీ వేడుక‌లోనూ హీరోయిన్లు చేస్తోన్న అరాచ‌కాల‌పై నోరు విప్పేవారు. టాలీవుడ్ లో ఒక‌ప్పుడు హీరోయిన్లు అన్ని ఆడియో వేడుక‌ల‌కు కానీ.. బ‌య‌ట ఫంక్ష‌న్ ల‌కు కానీ వ‌చ్చేవాళ్ల‌ని.. కానీ ఇప్పుడు అంతా క‌మ‌ర్షియ‌ల్ అయిపోయార‌ని అప్ప‌ట్లో దాస‌రి చాలా మ‌ద‌న‌ప‌డ్డారు. దానికి రామ్ చ‌ర‌ణ్ చిన్న‌పాటి సెటైర్లు కూడా వేసారు. మన హీరోయిన్లు అయితే అన్ని చోట్ల‌కు కూడా వ‌స్తున్నార‌ని చెప్ప‌డంతో అప్ప‌ట్లో దాస‌రి, చ‌ర‌ణ్ మ‌ధ్య చిన్న‌పాటి యుద్ధ‌మే జ‌రిగింది. ఆ త‌ర్వాత అది స‌ర్దుకుంది. ఇప్పుడు ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా కూడా హీరోయిన్ల‌పై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసాడు. తమకు సహకరించని హీరోయిన్ల తోకలు కత్తిరించాల్సి ఉంటుందని శివాజీ రాజా వార్నింగ్ ఇచ్చాడు. కాజ‌ల్, త‌మ‌న్నాను ఉద్ధేశించే శివాజీ రాజా ఈ క‌మెంట్స్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది.

రెమ్యున‌రేష‌న్ల రూపంలో కోట్లు దండుకుంటున్నారు.. ఎక్క‌డ్నుంచో వ‌చ్చిన మిమ్మ‌ల్ని ఇక్క‌డ మా నిర్మాత‌లు నెత్తిన పెట్టుకుని చూస్తున్నారు.. అడిగిన గొంతెమ్మ కోర్కెల‌న్నీ తీరుస్తున్నారు.. అయినా కూడా ఇక్క‌డ ఇండ‌స్ట్రీ బాగు ప‌డ‌టానికి మీ వంతు కృషి చేయ‌రా అంటూ ఫైర్ అయ్యాడు శివాజీరాజా. టాలీవుడ్ లో కోట్ల‌కు కోట్లు పారితోషికం తీసుకునే హీరోయిన్లు త‌మ‌న్నా, కాజ‌ల్. పైగా వీళ్లు బ‌య‌ట ఏదైనా ఫంక్ష‌న్ కు రావాల‌న్నా.. సోష‌ల్ మీడియాలో చిన్న ప్ర‌మోష‌న్ కోసం ట్వీట్ వేయాల‌న్నా కూడా డ‌బ్బులు తీసుకుంటార‌ని ప్రచారం జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీకి సంబంధించిన వేడుక‌ల‌కు రావాలంటే కూడా వీళ్ళ‌కు కాసులు ముట్టాల్సిందే. లేదంటే అడుగు కూడా బ‌య‌టపెట్ట‌రు. ఇప్పుడు కూడా ఇండ‌స్ట్రీ భ‌వ‌నం కోసం అమెరికాలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి వీళ్ల‌ను ర‌మ్మంటే మొహంపైనే రాము అని చెప్పార‌ని తెలుస్తుంది. అందుకే తెలుగు ఇండ‌స్ట్రీకి స‌పోర్ట్ చేయ‌ని ప‌రాయి రాష్ట్ర‌పు అమ్మాయిల‌ను ఇక్క‌డ బ్యాన్ చేయాల‌ని చెబుతున్నాడు శివాజీరాజా. అనుకున్న‌ట్లుగానే ఇప్పుడు మా అసోషియేష‌న్ కాజ‌ల్, త‌మ‌న్నాపై బ్యాన్ విధించింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. చూడాలిక‌.. ఈ వార్ చివ‌రికి ఎక్క‌డికి వ‌చ్చి ఆగుతుందో..? 

More Related Stories