English   

ఎట్టకేలకి మా అద్యక్ష్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేష్ !

Maa President Naresh oath on 22nd March
2019-03-20 13:44:47

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ విజయం సాధించినా మాజీ ప్రెసిడెంట్ మా కుర్చీ దిగేందుకు రాజీ పడకపోవడంతో మా అసోసియేషన్ రచ్చ మీడియాకి ఎక్కినా సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు నువ్వా నేనా అంటూ సాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ శివాజీ రాజా ప్యానల్‌ మీద సంచలన విజయం సాదించింది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నరేష్ మా ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్చి 22న ముహూర్తం పెట్టుకున్నారు. అయితే తనకు మార్చి 31 వరకూ గడువు ఉందని ఎట్టి పరిస్థితుల్లో మా ప్రెసిడెంట్ కుర్చీ వదిలే ప్రసక్తి లేదని శివాజీ రాజా భీష్మించుకు కూర్చున్నారు. అయితే ఈ విషయం మీద ఇరువర్గాల వారు పోటాపోటీ ప్రెస్ మీట్ లు కూడా పెట్టారు. మళ్ళీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే మరి విషయం సినీ పెద్దల దగ్గరకి వెళ్లిందో ఏమో కానీ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు మీడియాకి సమాచారం అందింది. ఈ శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో నూతన ప్యానెల్ ప్రమాణ స్వీకారం చేయనుంది.

More Related Stories