English   

గోపీచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

Director Maruthi
2021-03-06 17:04:56

మ్యాచో హీరో గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే టైటిల్ ను ఖ‌రారు చేసారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్  బ్యాన‌ర్ ల‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే సినిమా టైటిల్ ను రిలీజ్ డేట్ ను కూడా ప్ర‌క‌టించేశారు. చిత్ర విడుదల తేదీని కార్టూన్ క్యారకేచ‌ర్లు వాడుతూ వినూత్నంగా ప్ర‌క‌టించ‌డం కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. 

ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ను హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ క్వార్టర్స్ లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సినిమాతో ముచ్చ‌ట‌గా మూడోసారి జీఏ2 పిక్చ‌ర్స్యూ, యూవీ క్రియేష‌న్స్ మ‌రియు బ‌న్నీవాసు - మారుతి కాంబినేష‌న్ సెట్ అయింది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సినిమాలు తెర‌కెక్కించిన మారుతికి ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ప‌దో సినిమా కాబోతుంది. మ‌రోవైపు గోపీచంద్ కు 29వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమాకు జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తున్నార‌న్న‌ది చిత్ర‌యూనిట్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది. 

More Related Stories