English   

బాపురే.. మ్యాడీ మామూలుగా లేడుగా..!

Madhavan New Look In Savyasachi
2018-06-02 10:33:23

మాధ‌వ‌న్.. ఈ పేరు తెలియ‌ని వాళ్లుండ‌రేమో..? ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఇప్పుడు భిన్నమైన సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. హీరోగా ఇమేజ్ ఉండి కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే న‌టిస్తున్నాడు మ్యాడీ. ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గ‌త రెండు మూడేళ్ల‌లో సాలాఖ‌డూస్.. త‌నూవెడ్స్ మ‌నూ రిట‌ర్న్స్.. విక్ర‌మ్ వేధ లాంటి సినిమాలు చేసాడు మాధ‌వ‌న్. అంతేకాదు.. ఈయ‌నకు భాషా భేదాలు లేవు. ఇప్ప‌టికే తమిళ్ తో పాటు మ‌ళ‌యాల‌, హిందీల్లోనూ న‌టించాడు. ఇక ఇప్పుడు తెలుగులో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళనాట కూడా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు చందూమొండేటి. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. 

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో మాధ‌వ‌న్ విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇక వ‌య‌సు 48 దాటిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు ధీటుగా త‌న ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నాడు మాధ‌వ‌న్. జూన్ 1న ఈయ‌న పుట్టిన‌రోజు. ఆ సంద‌ర్భంగా కొన్ని స్టిల్స్ విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. అందులో ఆయ‌న్ని చూసి అంతా ఫిదా అవుతున్నారు. త‌న ఫిట్ నెస్ సీక్రేట్ పెద్ద‌గా ఏం ఉండ‌దంటున్నాడు ఈ హీరో. ఈ త‌రం హీరోలు జిమ్ పేరుతో చెమ‌టలు చిందిస్తున్నార‌ని.. అంత అవ‌స‌రం లేదంటున్నాడు మాధ‌వ‌న్. వ్యాయామం చేయాల్సిన అవసరం లేకుండా.. సీక్రెట్‌డైట్ తో బరువు తగ్గించుకోవటంలో మంచి ఫలితాలను పొందానని చెబుతున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. సాయంత్రం 6 గంటల తరువాత ఎలాంటి ఆహరాన్నీ తీసుకోనని.. రోజులో తీసుకునే రెండు భోజనాలకు మధ్య ఐదున్నర గంటల సమయం విరామం తీసుకోవటమే త‌న ఫిట్ నెస్ సీక్రేట్ అంటున్నాడు మ్యాడీ. మ‌రి చూడాలిక‌.. ఈ వ్యాయామం పాటించి కుర్రాళ్లు కూడా అదే ఫ‌లితం అందుకుంటారేమో..?

More Related Stories