English   

విల‌న్ గా మాధ‌వ‌న్.. ఈ సారి హీరో ఎవ‌రంటే..

Madhavan
2018-12-13 07:52:37

మాధ‌వ‌న్.. ఈ పేరు తెలియ‌ని వాళ్లుండ‌రేమో..? ఒక‌ప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. ఇప్పుడు భిన్నమైన సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. హీరోగా ఇమేజ్ ఉండి కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లో మాత్రమే న‌టిస్తున్నాడు మ్యాడీ. ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గ‌త రెండు మూడేళ్ల‌లో సాలాఖ‌డూస్.. త‌నూవెడ్స్ మ‌నూ రిట‌ర్న్స్.. విక్ర‌మ్ వేధ లాంటి సినిమాలు చేసాడు మాధ‌వ‌న్. అంతేకాదు.. ఈయ‌నకు భాషా భేదాలు లేవు. ఇప్ప‌టికే తమిళ్ తో పాటు మ‌ళ‌యాల‌, హిందీల్లోనూ న‌టించాడు. ఇక మొన్నీమ‌ధ్యే స‌వ్య‌సాచితో తెలుగు ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టాడు. తొలి సినిమా డిజాస్ట‌ర్ అయినా కూడా అందులో మాధవ‌న్ న‌ట‌న‌కు అంతా ఫిదా అయిపోయారు. ఎట్ట‌కేల‌కు ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత త‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులను నేరుగా క‌లుసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని సంతోషించాడు మ్యాడీ. 

స‌వ్య‌సాచి ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు ఈ న‌టుడికి తెలుగు నుంచి అవ‌కాశాలు మాత్రం ఆగ‌డం లేదు. ఇక‌పై వ‌రస అవ‌కాశాలు వ‌స్తే ఇక్క‌డే న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని మ్యాడీ కూడా చెప్ప‌డంతో క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు ద‌ర్శ‌కులు. ఇప్పుడు విఐ ఆనంద్ కూడా ఇదే చేసి మాధ‌వ‌న్ కు క‌థ చెప్పి ఒప్పించాడు అని తెలుస్తుంది. ఈయ‌న ఇప్పుడు ర‌వితేజ‌తో డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ఇందులో ర‌వితేజ సైంటిస్ట్ గా.. అల్ల‌రి వాడిగా రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండూ తండ్రి కొడుకుల పాత్ర‌లే. ఇందులో విల‌న్ పాత్ర కోసం మాధ‌వ‌న్ ను అడ‌గ‌డం.. ఆయ‌న ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయ‌ని తెలుస్తుంది. మొత్తానికి మాధ‌వ‌న్ ఇలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ పోతే తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో స్టైలిష్ విల‌న్ దొరికిన‌ట్లే. 
 

More Related Stories