English   

దేశం ప‌రువు కాపాడిన స్టార్ హీరో కొడుకు.. 

Madhavan-son

మాధ‌వ‌న్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌మిళ్ సినిమాల‌తో పాటు హిందీలోనూ ఈయ‌న‌కు కావాల్సినంత పేరు ఉంది. అక్క‌డ కూడా చాలా హిట్ సినిమాల్లో న‌టించాడు మాధవన్. ఇక తెలుగులోనూ ఇప్పుడు స‌వ్య‌సాచితో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు మ‌రికొన్ని సినిమాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉన్నాడు మ్యాడీ. ఇక ఇప్పుడు ఈయ‌న త‌న‌యుడు వేదాంత్ దేశం గ‌ర్వ‌ప‌డే విజ‌యం సాధించాడు. మాధ‌వ‌న్ - సరితా కుమారుడు వేదాంత్ భార‌త‌దేశానికి బ్రాంజ్ మెడ‌ల్ తీసుకొచ్చాడు. ఈ మ‌ధ్యే థాయ్ ల్యాండ్ లో జ‌రిగిన 1500 ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో తన  స‌త్తా చూపించాడు వేదాంత్. ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీలలో గెలిచి వేదాంత్ ఇండియాకు మెడ‌ల్ తీసుకొచ్చాడు. ఈ విజ‌యం సాధించింది వేదాంత్ అని తెలుసు కానీ ఆ వేదాంత్ మాధ‌వన్ కుమారుడు అని త‌ర్వాత తెలిసింది. ఈ అబ్బాయి ఫ‌లానా అని తెలుసుకున్న త‌ర్వాత సోష‌ల్ మీడియాలో మాధ‌వ‌న్ కు కంగ్రాట్స్ వెల్లువ కురిసింది. ఎంతైనా ఓ తండ్రికి ఇంత‌కంటే కావాల్సిందేముంది చెప్పండి..? ఇప్పుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు మాధవ‌న్. అన్న‌ట్లు ఈయ‌న ప్ర‌స్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. 

More Related Stories