English   

ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే.. వాళ్లపై మాధవీలత సీరియస్..

Madhavi Latha
2020-08-06 17:13:52

కొందరు అమ్మాయిలు పైకి చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ బృందావనం సినిమాలో ఎన్టీఆర్ మాదిరి వాళ్ళు పైకి మాత్రమే సాఫ్ట్ గా కనిపిస్తారు. లోపల ఒరిజినల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మాధవీలతను చూస్తే కూడా ఇదే అనిపిస్తుంది. పైకి ఎంతో సాఫ్ట్ గా ముచ్చటగా కనిపించే ఈ ముద్దుగుమ్మ లోపల మాత్రం ఫైర్ బ్రాండ్. ఎవరైనా ఈమెతో పెట్టుకుంటే అంతే సంగతులు. సోషల్ మీడియాలోనే బట్టలూడదీసి నగ్నంగా నిలబడుతుంది. అంత సీరియస్ గా ఉంటుంది మాధవి. నచ్చావులే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. అయితే ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చింది మాధవి లత. 

బీజేపీలో చేరి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. అయినా కూడా తాను ప్రజాసేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చాను కానీ పదవుల కోసం కాదు అంటూ డైలాగులు చెబుతోంది మాధవిలత. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కొందరు అసభ్య పదజాలంతో కొన్ని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై చాలా సీరియస్ అయింది ఈ హీరోయిన్. అన్నింటికీ తెగించి రాజకీయాల్లోకి వచ్చాను.. ఇలాంటి ఉడత బెదిరింపులకు ఎవరు భయపడరు.. నాతో పెట్టుకోవద్దు ఒక్కొక్కరి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించు కుంటాను అంటూ ఫైర్ అయిపోయింది. మీ మాటల ఇక్కడ భయపడే వాళ్ళు లేరు.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఇలాంటివి ఉంటాయని తెలుసు.. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలా మాట్లాడరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు కులమత భేదాలు లేవని ఒకవేళ తన సొంత పార్టీ తప్పు చేసినా కూడా నిలదీసి అడుగుతా అంటుంది మాధవిలత. ప్రస్తుతం సినిమా రంగానికి పూర్తిగా దూరమైపోయింది మాధవి.

More Related Stories