English   

ఆగిపోయిన ప్రియాంక పెళ్లి.. 

Madhu-Chopra
2018-08-23 13:11:28

అమ్మో.. మ‌ళ్లీ ఏంది లొల్లి అనుకుంటున్నారా..? మ‌ర‌లాగే ఉంటుంది సినిమా వాళ్ల పెళ్లిళ్లు అంటే. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌డానికి ఇది కామ‌న్ మ్యారేజ్ కాదు క‌దా..! సెలెబ్రెటీ మ్యారేజ్ అంటే క‌చ్చితంగా ప్లానింగ్ లేకుండా సాగిపోవ‌డ‌మే. ఇప్పుడు ప్రియాంక చోప్రా పెళ్లి విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఆమె పెళ్లి అక్టోబ‌ర్ లో అవుతుందని ముందు నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆగ‌స్ట్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుని మూడు నెల‌ల గ్యాప్ లోనే పెళ్లి చేసుకుంటారు అంటే ముందు నుంచి ఎవ‌రూ న‌మ్మ‌లేదు. అయితే ఇదే కార‌ణంగా చూపించి స‌ల్మాన్ ఖాన్ భ‌ర‌త్ సినిమా నుంచి కూడా త‌ప్పుకుంది ప్రియాంక చోప్రా. దాంతో న‌మ్మ‌క త‌ప్ప‌లేదు. అయితే ఇప్పుడు సీన్ లోకి ప్రియాంక వాళ్ల అమ్మ మ‌ధు చోప్రా వ‌చ్చింది. ఇప్ప‌ట్లో త‌న కూతురు పెళ్లి చేసుకోదంటూ చెప్పేసింది. దాంతో చాలా మందికి సీన్ క్లియ‌ర్ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా అల్లుడు గురించి కూడా గొప్ప‌లు చెప్పుకుంది ఈమె. నిక్ చాలా మంచి కుర్రాడ‌ని.. అయితే ఇప్పుడు ఇద్ద‌రూ త‌మ సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈ పెళ్లి వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది మ‌ధు చోప్రా. అన్న‌ట్లు ప్రియాంక చోప్రా ఇప్పుడు మ‌ళ్లీ బాలీవుడ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ది స్కై ఈజ్ బ్లూ అంటూ మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిందీ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ చిత్ర సెట్ లో కూడా అడుగు పెట్టింది. మొత్తానికి అటు పెళ్లి.. ఇటు కెరీర్ రెండింటినీ ప‌ర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఈ భామ‌.

More Related Stories