English   

మాధురి దీక్షిత్ ప్రేమకథ గురించి మీకు తెలుసా..?

madhuri
2020-05-24 15:51:23

బాలీవుడ్‌లో మాధురీ దీక్షిత్ పేరు తెలియని వాళ్లుండరు. డాన్సులకు ఈమె పెట్టింది పేరు. ఆ డాన్సులే ఆమెను నెంబర్ వన్ హీరోయిన్ గా మార్చేసాయి కూడా. 2000 వరకు కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలందరితోనూ నటించింది మాధురి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈమె జీవితంలో కూడా పెళ్లికి ముందు ఓ ప్రేమకథ ఉండేది. అయినా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు కామన్ అయిపోయాయి కూడా. అందులో మాధురి దీక్షిత్ కూడా ఒకరు. ఈమె 1984లో విడుదలైన అబోద్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమె జీవితంలో పెళ్లి ఓ మ్యాజిక్. అప్పట్లో ఈమె సంజయ్ దత్‌తో ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది.

ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారేమో అని వార్తలొచ్చాయి. అప్పట్లో ఈ జోడీ సూపర్ హిట్ అంతే. వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సాజన్, ఖల్ నాయక్ సినిమాలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాయి. ఈ క్రమంలోనే తనకు సంజయ్ అంటే చాలా యిష్టమని మాధురి కూడా చెప్పుకొచ్చింది. అయితే అనుకోకుండా కొన్ని కారణాలతో సంజయ్ నుంచి దూరంగా విడిపోయింది మాధురీ దీక్షిత్. ఆయన దూరమైన తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఈమె. అప్పుడు యుఎస్ లో సెటిల్ అయిన తన సోదరుడు అజిత్ దీక్షిత్ వల్ల మాధురి డిప్రెషన్ నుంచి బయటపడింది. అక్కడే ఉండగా ఆమె పెళ్లి ఫిక్స్ ఐంది. అజిత్ తన స్నేహితుడు, డాక్టర్ గా యుఎస్ లో సెటిల్ అయిన శ్రీరామ్ గురించి మాధురితో చెప్పాడు. అలా 1999లో అమెరికాకు చెందిన శ్రీరామ్ నేనే ఎన్ఆర్‌ఐ ను పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఆజా నాచ్‌లే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరస సినిమాలు చేస్తుంది ఈమె.

More Related Stories