English   

10 ఏళ్ళ మగధీరుడు.. రాజమౌళి అద్భుతానికి దశాబ్దం..

charan
2019-07-30 21:52:24

మ‌గ‌ధీర.. తెలుగు సినిమా స్థాయిని తొలిసారి బాలీవుడ్ కు తెలియ‌జేసిన సినిమా. 2009లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం అఖండ విజ‌యం సాధించింది. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ క‌ళాఖండంగా మ‌గ‌ధీర మిగిలిపోయింది. ఇటు కాజ‌ల్ కెరీర్ ను కూడా ఒంటిచేత్తో మ‌లుపుతిప్పిన సినిమా మ‌గ‌ధీర‌. 2009, జులై 31న ఈ సినిమా విడుద‌లైంది. నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు మ‌గ‌ధీరుడు. గీతాఆర్ట్స్ సంస్థ‌లో అల్లుఅర‌వింద్ నిర్మించిన ఈ చిత్రానికి అప్ప‌ట్లోనే 40 కోట్ల బ‌డ్జెట్ పెట్టించాడు ద‌ర్శ‌కధీరుడు. ఇప్ప‌టికీ చాలా రికార్డులు మ‌గ‌ధీర పేరు మీదే ఉన్నాయి 30 నుంచి 40 రూపాయ‌ల టికెట్ తోనే 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది మ‌గ‌ధీర‌. చాలా ఏరియాల్లో క‌ల‌లో కూడా ఊహించ‌ని రికార్డుల‌ను అప్ప‌ట్లోనే సెట్ చేసాడు మ‌గ‌ధీరుడు.
అంత పెట్ట‌డ‌మే కాదు.. పెట్టిన బ‌డ్జెట్ కు రెండింత‌లు వ‌సూలు చేసి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది మ‌గ‌ధీర‌. తెలుగు సినిమా లెక్క‌లు మార్చేసిన చిత్రంగా మ‌గ‌ధీర ఎప్ప‌టికీ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. తెలుగు సినిమా స్టామినా ఇంత‌గా ఉంద‌ని బాలీవుడ్ కి కూడా తెలియ‌జేసిన సినిమా మ‌గ‌ధీర‌. ఇక రామ్ చ‌ర‌ణ్ కెరీర్ ఇంకో ప‌దేళ్లైనా.. ఇర‌వై ఏళ్లైనా ఇంత‌కంటే గొప్ప చిత్రం రాదేమో..! అప్ప‌టి రేట్ల‌తో ఇప్ప‌టికీ చాలా చోట్ల మ‌గ‌ధీర సృష్టించిన రికార్డులు అలాగే ఉన్నాయి. రాజ‌మౌళిని ఇండియ‌న్ వైడ్ గా పాపుల‌ర్ చేసిన సినిమా కూడా మ‌గ‌ధీరే. త‌మిళ‌నాట కూడా మావీర‌న్ గా విడుద‌లై విజ‌యం సాధించింది మ‌గ‌ధీర‌. 10 ఏళ్ళు కాదు.. మ‌రో ప‌దేళ్లైనా మ‌గ‌ధీర స్థానం తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఇలాగే నిలిచిపోవ‌డం ఖాయం.

More Related Stories