English   

తన చివరి సినిమా ప్రకటించిన రాజమౌళి !

rajamouli
2019-03-15 11:04:46

బాహుబలి సిరీస్ లో విడుదల అయిన రెండు సినిమాలు 2 చిత్రాలు  ప్రపంచ వ్యాప్తంగా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాయి. ఈ సినిమాల తర్వాత రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నారని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే బాహుబలి ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఒక ప్రశ్న వేసినప్పుడు మహాభారతం తన డ్రీం ప్రాజక్ట్ అని చెప్పుకొచ్చారు. దీంతో బాహుబలి తర్వాత రాజమౌళి తీయనున్న సినిమా మహా భారతం అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన చాలా గ్యాప్ తీసుకోవడంతో ఈ విషయం మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆయన ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పచ్చజెండా ఊపాడు. నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా ఇవే విషయాలు కొందరు మీడియా వారు రాజమౌళిని ప్రశ్నించారు.  బాహుబలి తర్వాత మహాభారతం సినిమా తీస్తారని ప్రచారం జరిగింది. మహాభారతం ఎప్పుడూ ప్రారంభిస్తారు. ఆ ప్రాజెక్టు మీ మైండ్ లో ఏ దశలో ఉందని రాజమౌళిని ప్రశ్నించాడు. దీనికి జక్కన్న స్పందిస్తూ మహాభారతం మొదలు పెడుతున్నానని తను ఎప్పుడూ చెప్పలేదని నిజానికి అది తన డ్రీమ్ ప్రాజెక్టు మాత్రమే అని చెప్పానని కానీ తను తీయబోయే తర్వాత సినిమా అదే అని అందరూ అనుకున్నారని ఈ విషయంపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా అదే ప్రశ్న మళ్లీ అడుగుతున్నారని అన్నారు. మహాభారతాన్ని సినిమా కాదు కానీ సిరీస్ గా తీసే ఆలోచన ఉంది. బహుశా అదే తన చివరి సినిమా లేదా సిరీస్ అవ్వొచ్చని రాజమౌళి చెప్పుకొచ్చారు.

More Related Stories