English   

మ‌హాన‌టి సెన్సార్ టాక్.. గెలుపు ఖాయ‌మే..!

Mahanati-censor
2018-05-06 17:28:14

ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న మ‌హాన‌టి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తైంది. ఎప్ప‌ట్లాగే సెన్సార్ స‌భ్యులు అదిరిపోయింద‌ని చెప్పార‌ని.. చాలా గొప్ప సినిమా తీసారంటూ పొగిడార‌ని చెబుతున్నారు. అయితే ఈ సారి మాత్రం అది నిజ‌మే. నిజంగానే మ‌హాన‌టి ఏడిపించ‌డం ఖాయం అని.. థియేట‌ర్స్ లోంచి క‌ళ్లు తుడుచుకోకుండా ఎవ‌రూ బ‌య‌టికి రార‌ని తెలుస్తుంది. సావిత్రి జీవితాన్ని అంత హృద్యంగా తెర‌కెక్కించాడు నాగ్ అశ్విన్. ఇప్ప‌టికే విడుద‌ల‌వుతున్న కీర్తిసురేష్ పోస్ట‌ర్స్ అన్నీ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేస్తున్నాయి. పైగా సినిమా నిండా పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకుని.. ఒకే సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్ చేస్తోన్న మ‌హాయ‌జ్ఞం ఈ మహాన‌టి. మే 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. మే 11న పూరీ జ‌గ‌న్నాథ్ మెహబూబా రానుంది. అయినా కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు మ‌హాన‌టి. దీని వెన‌క బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. క‌థ‌పై వాళ్ల‌కు ఉన్న న‌మ్మ‌కం అలాంటిది. పైగా బిజినెస్ కూడా ఇలాగే జ‌రుగుతుంది సినిమాది. బ‌డ్జెట్ అంతా 22 కోట్లు అయితే శాటిలైట్ రైట్స్ రూపంలోనే అంత మొత్తం వ‌చ్చేసింది నిర్మాత అశ్వినీద‌త్ కు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది. సావిత్రి అంద‌రి సొత్తు కాబ‌ట్టి అన్ని చోట్లా సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. మొత్తానికి పెట్టిన బ‌డ్జెట్ అంతా కేవ‌లం శాటిలైట్ రూపంలోనే రావ‌డంతో నిర్మాత అశ్వినీద‌త్ పండ‌గ చేసుకుంటున్నాడు ఇప్పుడు. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత మ‌హాన‌టి ఎంత‌మందిని ఏడిపిస్తుందో చూడాలిక‌..!

More Related Stories