English   

మ‌హానటి.. అమ్మ‌కు నీరాజ‌నం..!

Mahanati-collections

సావిత్రి జీవితాన్ని తెర‌కెక్కిస్తే ఎవ‌రు చూస్తారు అనుకున్న వాళ్ల‌కు ఇప్పుడు దిమ్మ‌తిరిగిపోయేలా స‌మాధానం ఇచ్చింది మ‌హాన‌టి సినిమా. ఈ చిత్రానికి వ‌స్తున్న వ‌సూళ్ళు చూసి అంతా షాక్ అవుతున్నారు. తొలిరోజు నుంచే అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో పెద్ద సినిమాల‌కు సైతం షాక్ ఇస్తుంది ఈ చిత్రం. ఓవ‌ర్సీస్ లో అయితే తొలిరోజే 3.50 కోట్ల గ్రాస్.. కోటి 50 ల‌క్ష‌ల షేర్ వ‌సూలు చేసింది. ఈ మ‌ధ్యే వ‌చ్చిన నా పేరు సూర్య కంటే ఇది ఎక్కువ వ‌సూళ్లు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కోటిన్న‌ర షేర్ తీసుకొచ్చింది మ‌హాన‌టి. ఓవ‌రాల్ గా తొలిరోజే మూడు కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది ఈ చిత్రం. పాజిటివ్ టాక్ ఉండ‌టంతో క‌చ్చితంగా రాబోయే రోజుల్లో మ‌హాన‌టికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. పైగా సావిత్రి జీవితం కావ‌డంతో కుటుంబాలు క‌దులుతున్నాయి థియేట‌ర్స్ కు. చాలా రోజుల త‌ర్వాత అద్భుతమైన‌ సినిమా చూసామంటూ ప్రేక్ష‌కులు కూడా మ‌న‌సు త‌డుపుకుంటూ థియేట‌ర్స్ నుంచి బ‌య‌టికి వ‌స్తున్నారు. పైగా ఇది సినిమా కాదు.. సెలెబ్రేష‌న్ ఆఫ్ సావిత్రి లైఫ్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఒక్క సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది మొత్తానికి. 
 

More Related Stories