English   

మ‌హాన‌టి ఎంత‌వ‌ర‌కు ఈ ప్ర‌యాణం..?

Mahanati-Collections
2018-05-16 16:47:23

విడుద‌ల‌కు ముందు ఎవ‌రూ అనుకోలేదు మ‌హాన‌టి ఇంత‌గా సంచ‌ల‌నాలు సృష్టిస్తుందని..? ఆ త‌రం కాబ‌ట్టి క‌చ్చితంగా పెద్దోళ్లు థియేట‌ర్స్ కు వ‌స్తార‌ని తెలుసు.. కానీ ఈ త‌రం కూడా మ‌హాన‌టి కోసం ఎగ‌బ‌డ‌తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. కానీ ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. థియేట‌ర్స్ లో పెద్దోళ్ల‌కు తోడు.. కుర్రాళ్లు కూడా సంద‌డి చేస్తున్నారు. ఈ చిత్ర రేంజ్ రోజు రోజుకీ పెరుగుతూ పోతుంది. నిజంగానే నిర్మాత స్వ‌ప్న అన్న‌ట్లు అశ్వినీ ద‌త్ కు.. వైజ‌యంతికి ఏడేళ్ల వ‌న‌వాసం అయిపోయిందేమో..! వాళ్లు మ‌ళ్లీ రేస్ లోకి వ‌చ్చేసారు. అది కూడా మామ‌లుగా కాదు.. ఓ గొప్ప సినిమాతో వ‌చ్చారు. వ‌సూళ్ల ప‌రంగా కూడా ఇప్పుడు మ‌హాన‌టి తీరు చూస్తుంటే చాలా రికార్డులు బ‌ద్ద‌ల‌య్యేలా క‌నిపిస్తున్నాయి. ఈ మ‌ధ్యే రంగ‌స్థ‌లం లాంగ్ ర‌న్ లో 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.. ఇప్పుడు మ‌హాన‌టి కూడా లాంగ్ ర‌న్ ఖాయమ‌య్యేలా క‌నిపిస్తుంది. తొలివారం 18 కోట్ల షేర్ వ‌సూలు చేసిన ఈ చిత్రం.. రెండు మూడు వారాల్లో ఇంకా ఎక్కువ తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే ఇప్ప‌ట్లో సినిమాలేవీ లేవు.. ఉన్నా అమ్మ ముందు నిల‌బ‌డేలా లేవు. ఓవ‌ర్సీస్ లో అయితే ఈజీగా 2.5 మిలియ‌న్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది ఈ చిత్రానికి. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా అద్భుతం అనే సినిమాతో వ‌చ్చారు వైజ‌యంతి మూవీస్. 
 

More Related Stories