English   

అప్పుడు సావిత్రి బ‌లి.. ఇప్పుడు జెమినీ బ‌లి..!

mahanati
2018-05-19 06:52:45

సావిత్రి బ‌తికి ఉన్న‌పుడు ఆమె జీవితంలో విల‌న్ ఎవ‌రంటే మ‌రో ఆలోచ‌న లేకుండా అన్ని వేళ్లు చూపించేది ఒక్క‌రి వైపే.. అత‌డే జెమినీ గ‌ణేష‌న్. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి చావును కూడా బ‌హుమ‌తిగా ప్ర‌సాదించాడు జెమినీ. అంటే ఆయ‌నే చంపేసాడు అని కాదు.. సావిత్రి త‌న జీవితంలో స‌ర్వం కోల్పోవ‌డానికి కార‌ణం మాత్రం జెమినీ అని ప్ర‌తీ ఒక్క‌రు ఒప్పుకోవాల్సిన నిజం. ఆయ‌న చేసిన కొన్ని పనుల వ‌ల్లే సావ‌త్రి జీవితం నాశ‌నం అయిపోయింది. స్టార్ హీరోయిన్ గా.. రాణిభోగం అనుభ‌వించిన సావిత్రి చివ‌రి రోజుల్లో క‌నీసం చేతిలో చిల్లిగ‌వ్వ లేకుండా చ‌చ్చిపోతే ద‌హ‌న సంస్కారాలు కూడా చేయించుకోలేనంత దారుణ‌మైన స్థితికి దిగ‌జారిపోయింది. దానికి కార‌ణం క‌చ్చితంగా ఆమె భ‌ర్త‌ జెమినీ గ‌ణేష‌నే. అప్పుడు ఈమె జీవితంలో విల‌న్ గా ఉన్న జెమినిపై ఇప్పుడు ప‌గ తీర్చుకుంటుంది సావిత్రి.

అదెలా అంటారా..? ఇప్పుడు మ‌హాన‌టి విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్రంలో అంతా కీర్తిసురేష్ పోషించిన సావిత్రి పాత్ర గురించే పొగుడుతున్నారు కానీ దుల్క‌ర్ ప్రాణం పోసిన జెమినీ గురించి ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. దానికి కార‌ణం ఆ పాత్ర‌పై అంద‌రికీ ఉన్న కోప‌మే. అందుకే దుల్క‌ర్ అంత బాగా న‌టించినా కూడా ఇప్పుడు అత‌డి గురించి ఏ ఒక్క‌రు కూడా చ‌ర్చించ‌డం లేదు. బాగా చేసాడులే అంటున్నారే కానీ అంతా సావిత్ర‌మ్మ‌పైనే జాలి చూపిస్తున్నారు. అలా అప్పుడు సావిత్రికి చేసిన ద్రోహం ఇప్పుడు సినిమా రూపంలో బ‌య‌టికి వ‌చ్చింది. ఆ కోప‌మే ఇప్పుడు దుల్క‌ర్ చేసిన పాత్ర‌ను కూడా మ‌రిచిపోయి అంతా అత‌డు చేసిన జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌ను తిట్టుకుంటున్నారు. మొత్తానికి అప్పుడు సావిత్రి జీవితంలో జెమినీ విల‌న్ అయితే.. ఇప్పుడు హీరోయిన్ గా మారి జెమిని గ‌ణేష‌న్ పై ప‌ర్ ఫెక్ట్ గా త‌న ప్ర‌తీకారం తీర్చుకుంది సావిత్ర‌మ్మ‌. 

More Related Stories