English   

మ‌హాన‌టి.. డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్..!

Mahanati-collections
2018-06-28 12:46:26

సావిత్రి అంటేనే దాన‌గుణానికి ప్ర‌తీక‌. అప్ప‌ట్లో క‌ర్ణుడు ఎలా ఉంటాడో తెలియ‌దు కానీ సావిత్రిని చూసిన‌పుడు మాత్రం అచ్చంగా అప్ప‌ట్లో ఆ క‌ర్ణుడు కూడా ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది అంటారు ఆమె నుంచి సాయం పొందిన‌వాళ్లు. ఇక ఇప్పుడు ఈమె సాయం అశ్వినీద‌త్ కు కూడా చేసింది. బ‌తికి ఉన్న‌పుడు అంద‌రి క‌ష్టాలు తీర్చిన మ‌హాన‌టి.. ఇప్పుడు చ‌నిపోయిన త‌ర్వాత కూడా అదే కొన‌సాగిస్తుంది. త‌న‌ను న‌మ్మి సినిమా తీసిన అశ్వినీద‌త్ అండ్ ఫ్యామిలీకి కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ రోజు మ‌హాన‌టి చిన్న సినిమాగా మొద‌లైన ప్ర‌యాణం భారీ సినిమాగా మారిపోయింది. ఈ సినిమా ప్ర‌యాణం ముగిసింది. విడుద‌లైన ఏడో వారం కూడా ఈ చిత్రం కొన్ని చోట్ల షేర్స్ తీసుకొచ్చింది. 50 రోజుల దిగ్విజ‌య ప్ర‌యాణంలో 42 కోట్ల‌కు పైగానే షేర్ సాధించింది మ‌హాన‌టి. ఈ చిత్రాన్ని అమ్మింది కేవ‌లం 18 కోట్ల‌కే. అది కూడా సొంతంగా విడుద‌ల చేసుకున్నారు వై జ‌యంతి మూవీస్. దాంతో ఏడేళ్ల త‌మ క‌ష్టాల‌న్నీ ఇప్పుడు మ‌హాన‌టి తీర్చేసింది. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం 11 కోట్ల షేర్ తీసుకురావ‌డం అద్భుతం. ఇక నైజాం మార్కెట్ ను కూడా శాసించింది సావిత‌మ్మ‌. ఇక్క‌డ 11 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. మొత్తానికి ఈ స‌మ్మ‌ర్ లో రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌చ్చిన నిఖార్సైన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌హాన‌టి.

More Related Stories