English   

మ‌హాన‌టి ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్.. 

Keerthy-Suresh
2018-07-19 11:27:05

సావిత్రి అంటేనే దాన‌గుణానికి ప్ర‌తీక‌. అప్ప‌ట్లో క‌ర్ణుడు ఎలా ఉంటాడో తెలియ‌దు కానీ సావిత్రిని చూసిన‌పుడు మాత్రం అచ్చంగా అప్ప‌ట్లో ఆ క‌ర్ణుడు కూడా ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది అంటారు ఆమె నుంచి సాయం పొందిన‌వాళ్లు. ఇక ఇప్పుడు ఈమె సాయం అశ్వినీద‌త్ కు కూడా చేసింది. బ‌తికి ఉన్న‌పుడు అంద‌రి క‌ష్టాలు తీర్చిన మ‌హాన‌టి.. ఇప్పుడు చ‌నిపోయిన త‌ర్వాత కూడా అదే కొన‌సాగిస్తుంది. ఏ జ‌న్మ‌లో రుణ‌మో తెలియ‌దు కానీ ఈ చిత్రంతో అది కూడా తీర్చేసుకుంది ఈ మ‌హాన‌టి. త‌న‌ను న‌మ్మి సినిమా తీసిన అశ్వినీద‌త్ అండ్ ఫ్యామిలీకి కాసుల వ‌ర్షం కురిపించింది. చిన్న సినిమాగా మొద‌లై భారీ ప్ర‌యాణంతో గ‌మ్యం చేరుకుంది మ‌హాన‌టి. ఇప్పుడు ఫైన‌ల్ ర‌న్ క‌లెక్ష‌న్స్ కూడా వ‌చ్చేసాయి. ఫుల్ ర‌న్ లో 45 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని అమ్మింది కేవ‌లం 18 కోట్ల‌కే. అది కూడా సొంతంగా విడుద‌ల చేసుకున్నారు వై జ‌యంతి మూవీస్. దాంతో ఏడేళ్ల త‌మ క‌ష్టాల‌న్నీ ఇప్పుడు మ‌హాన‌టి తీర్చేసింది. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం 11 కోట్ల షేర్ తీసుకురావ‌డం అద్భుతం. ఇక నైజాం మార్కెట్ లో కూడా 11 కోట్లు వ‌సూలు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ స‌మ్మ‌ర్ లో రంగ‌స్థ‌లం త‌ర్వాత వ‌చ్చిన నిఖార్సైన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌హాన‌టి.             

More Related Stories