English   

ఓవ‌ర్సీస్ లో మ‌హాన‌టి అదుర్స్.. 

Mahanati
2018-05-09 16:38:37

సావిత్రి అంటే కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్ర‌పంచంలో తెలుగు వాళ్లు ఎక్క‌డున్నా కూడా అంద‌రికీ ఆస‌క్తే. ఎందుకంటే ఆమె మ‌హాన‌టి సావిత్రి కాబ‌ట్టి. ఆమె జీవితం గురించి తెలుసుకోవాల‌ని ప్ర‌తీ తెలుగు వాడు కోరుకుంటాడు. ఇప్పుడు మ‌హాన‌టి సినిమా విడుద‌లైంది. ఊహించిన‌ట్లుగానే ఈ చిత్రానికి ఓవ‌ర్సీస్ లో అదిరిపోయే ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. ప్రీమియ‌ర్స్ తోనే సినిమా రేంజ్ ఏంటో అంద‌రికీ తెలిసిపోతుంది. స్టార్ హీరోల సిని మాల‌కు తీసిపోని విధంగా మ‌హాన‌టి ప్రీమియ‌ర్స్ కు క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు అక్క‌డ ఈ సినిమా క్రేజ్ ఏంటో..? ప‌్ర‌తీ తెలుగు హృద‌యం కూడా గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాగా దీన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించాడంటున్నారు ప్రేక్ష‌కులు. ఈ చిత్రం క‌చ్చితంగా అక్క‌డ అద్భుత విజయం సాధించ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఇక మ‌న ద‌గ్గ‌ర ఎలా ఉండ‌బోతుందో చూడాలి మ‌హాన‌టి. 

More Related Stories