English   

వామ్మో.. మహానటి 15కోట్లా .. ?

mahanati gross 15cr

ఈ వార్త చూసిన తర్వాత దటీజ్ మహానటి అనుకుండా ఉండలేం. ఆ రేంజ్ లో ఆశ్చర్యపరుస్తోంది మహానటి. ఏ ముహూర్తాన సెట్ అయిందో కానీ ఈ ప్రాజక్ట్.. ముందు నుంచీ అన్నీ సెన్షేషన్సే.. రిలీజ్ అయిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా డిసైడ్ అయింది. అశ్వనీదత్ కూతుళ్లకు అదిరిపోయే లాభాలు తెచ్చింది. ఓవర్శీస్ లో కూడా చాలామంది స్టార్ హీరోలను దాటేసి రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు అదనంగా మరో 15కోట్ల లాభాల్ని తెచ్చింది. లేటెస్ట్ గా మహానటి శాటిలైట్ బిజినెస్ పూర్తయింది. ఈ డీల్ 15కోట్లకు సెట్ అయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కదూ.. పెద్ద స్టార్స్ పెద్దగా లేకుండానే ఈ స్థాయి డీల్ అంటే రికార్డ్స్ కూడా విస్తుపోయే విషయం ఇది. 

స్టార్ మా టివి మహానటి శాటిలైట్ రైట్స్ తీసుకుంది. ముందుగా మూవీ టీమ్ 18కోట్లు ఎక్స్ పెక్ట్ చేసింది. కానీ బయోపిక్ కాబట్టి ఒక్కసారి చూసిన తర్వాత మరోసారి చూడ్డానికి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుందనుకోలేం. కాబట్టి అంత ఇవ్వం అని స్టార్ మా చెప్పేసింది. మొత్తంగా కొన్ని రోజులు నాన్చుడు తర్వాత తెలుగుతో పాటు, తమిళ, మళయాల భాషల్లో కలిపి ఈ 15కోట్ల డీల్ ఫైనల్ అయింది. ఏదేమైనా ఓ బయోపిక్ కు తెలుగులో ఈ రేంజ్ శాటిలైట్ మార్కెట్ కావడం రియల్లీ ఏ రికార్డ్. 

More Related Stories