English   

  మిస్స‌మ్మను దించేసారుగా.. 

Keerthy-suresh
2018-05-25 08:12:23

మ‌హాన‌టి చూసిన త‌ర్వాత కీర్తిసురేష్ ను పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అస‌లు ఈ చిత్రంలో కీర్తి లేదు సావిత్రి మ‌ళ్లీ ప్రాణం పోసుకుని వ‌చ్చింది అంటున్నారు. దీన్నిబ‌ట్టి ఈమె ఏ స్థాయిలో న‌టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా విడుద‌లై మూడు వారాలు కావొస్తున్నా కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు సినిమాకు. క‌లెక్ష‌న్లు కూడా అలాగే వ‌స్తున్నాయి. ఇక ఇప్పుడు సినిమాలోని కొన్ని డిలీటెడ్ సీన్స్ ను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శక‌ నిర్మాత‌లు. ఇవి కూడా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి సోష‌ల్ మీడియాలో. తాజాగా మిస్స‌మ్మ సీన్ విడుద‌లైంది. అందులో రావోయి చంద‌మామ త‌మిళ వ‌ర్ష‌న్ పాట విడుద‌లైంది. దుల్క‌ర్, కీర్తిసురేష్ ఇద్ద‌రూ ఈ పాట‌కు ప్రాణం పోసారు. నిజంగానే అక్క‌డ మ‌నం చూస్తున్న‌ది సావిత్రి, జెమిని గ‌ణేష‌న్ నా అనేంతగా ఆ పాట‌కు ప్రాణం పోసారు. సినిమాలో కేవ‌లం 10 సెక‌న్లు మాత్ర‌మే ఈ బిట్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏకంగా నిమిషంపైనే ఉన్న విజువ‌ల్ విడుద‌ల చేసారు. మొన్న కూడా మాయాబ‌జార్ లోని సీన్ విడుద‌ల చేసారు. ఇలా ఇంకా ఎన్ని డిలీటెడ్ సీన్స్ ఉన్నాయో..? ఆ సీన్స్ లో కీర్తి ఎంత‌గా ప్రాణం పెట్టిందో..?
 

More Related Stories