English   

మ‌హాన‌టిలో అవే హైలైట్ అంట‌..!

mahanati-talk
2018-05-09 07:16:56

మ‌హాన‌టి.. మ‌హాన‌టి.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా ఇదే పేరు మార్మోగిపోతుంది. దానికి కార‌ణం సావిత్రి. విడుద‌ల‌కు వారం ముందు వ‌ర‌కు కూడా సినిమాపై పెద్ద‌గా అంచ‌నాలు లేన‌ట్లు క‌నిపించాయి కానీ మూడు రోజుల ముందు నుంచి ఈ పేరు త‌ప్ప మ‌రోటి వినిపించ‌ట్లేదు. ఈ సినిమా యూనిట్ చేసిన ప్ర‌చారం ఒకెత్తైతే.. ఇందులో విజువ‌ల్స్ మ‌రో ఎత్తు. మ‌రీ ముఖ్యంగా క్యాస్టింగ్ ఒక్కొక్క‌టిగా రివీల్ అవుతుంటే సినిమాపై అంచ‌నాలు కూడా అలాగే పెరుగుతూ వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఓవ‌ర్సీస్ టాక్ ప్ర‌కారం చూస్తే మ‌హాన‌టి క‌చ్చితంగా అంద‌ర్నీ అల‌రిస్తుంద‌ని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ మ‌రీ ప్ర‌యోగాల‌కు పోకుండా సినిమాను ఫ్లాట్ గా తెర‌కెక్కించాడ‌ని.. ఎక్క‌డా రిస్క్ తీసుకోకుండా అన్ని పాత్ర‌ల‌కు కూడా స‌రైన గుర్తింపును ఇచ్చాడ‌ని తెలుస్తుంది. సావిత్రిగా కీర్తిసురేష్ కెరీర్ లోనే నిలిచిపోయే ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింద‌ని.. చాలా షేడ్స్ ఉన్న జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌కు దుల్క‌ర్ ప్రాణం పోసాడంటున్నారు ప్రేక్ష‌కులు. ఇక ఈ చిత్రంలో ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ తో పాటు క్లైమాక్స్ అద్భుతంగా ఉంద‌ని తెలుస్తుంది. మ‌రీ ముఖ్యంగా సావిత్రి చివ‌రి రోజుల్ని చూపించిన విధానం.. జెమినీ గ‌ణేష‌న్ తో విడిపోయే సంద‌ర్భంలో వ‌చ్చే సీన్.. సినిమాకు హైలైట్ అంటున్నారు. మ‌రి చూడాలిక‌.. మ‌హాన‌టి ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు అల‌రిస్తుందో..? 

More Related Stories