English   

సావిత్రమ్మ బస్సు అదిరిపోయిందిగా.. మహానటి నిర్మాతల బహుమతి..

Mahanati
2019-02-11 05:31:14

మహానటి సావిత్రి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరానికి ఆమె గొప్పతనాన్ని చూపిస్తూ మహానటి సినిమా తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దాదాపు 70 కోట్లు వసూలు చేసి అశ్వినీదత్ నిర్మాణ సంస్థను మరోసారి నిలబెట్టింది మహానటి. ఇదిలా ఉంటే ఈ చిత్రం సంచలన విజయం సాధించిన నేపథ్యంలో సావిత్రి స్థాపించిన పాఠశాలకు ఒక బస్సును బహుమతిగా ఇచ్చారు నిర్మాతలు. 1962లో వడ్డివారిపాలెంలో స్కూల్ మొదలుపెట్టింది సావిత్రి. అప్పట్లో తాత సంపాదించిన మొత్తంలో చాలావరకు స్కూల్ కోసం ఖర్చు చేసేది సావిత్రమ్మ. ఇక్కడ ఉండే పిల్లల ఆలనా పాలనా కూడా చూసుకొనేది. స్కూల్ కోసం ఎలాంటి అవసరం వచ్చినా కూడా సావిత్రి ముందుండేది. ఇప్పటికీ ఆ స్కూల్ నడుస్తూనే ఉంది. సావిత్రి గుర్తుగా ఇప్పుడు స్వప్న సినిమా అధినేతలు పాఠశాలకు స్కూల్ బస్సును బహుమతిగా ఇచ్చారు. దానిపై సావిత్రమ్మ బొమ్మ ఉంది. అది చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆనందిస్తున్నారు. మొత్తానికి ఆమె స్థాపించిన స్కూల్ లో బొమ్మ ఉన్న బస్సులో పిల్లలు వెళ్లి రావడం ఆనందంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు కూడా.

More Related Stories