English   

మ‌హాన‌టి.. ప్ర‌మోష‌న్స్ పిచ్చెక్కిస్తున్నారుగా..!

mahanati
2018-05-07 16:57:42

అశ్వినీద‌త్ 40 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాడు. ఎన్నో విజ‌యాలు అందుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయ‌న కూతుళ్లు నిర్మించిన మ‌హాన‌టి గురించి మాత్రం ఆయ‌న చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాడు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్న తీరు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ఇన్నేళ్ల‌లో త‌ను ఎప్పుడూ ఈ స్థాయిలో త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకోలేదు అశ్వినీద‌త్. కానీ ఇప్పుడు యంగ్ జ‌న‌రేష‌న్ వ‌చ్చింది క‌దా.. అందుకే సినిమా ల‌ను ప్ర‌మోట్ చేసే విధానం కూడా మారిపోయింది. విడుద‌ల‌కు ఇంకా రెండు రోజులే ఉండ‌టంతో పిచ్చెక్కిస్తున్నారు నిర్మాత‌లు ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్. ఇక ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా వీళ్ళ‌తో పాటు క‌ష్ట‌ప‌డుతున్నాడు. రోజుకో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ సినిమాపై ఎక్క‌డ లేని ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్వీ రంగారావుగా మోహ‌న్ బాబు అదిరిపోయాడు. ఆయ‌న పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాల‌న్నీ మ‌రో లెవ‌ల్ కు వెళ్లిపోయాయి. 

ఈ మ‌ధ్యే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. మ‌హాన‌టి ఏడిపించ‌డం ఖాయం అని.. థియేట‌ర్స్ లోంచి క‌ళ్లు తుడుచుకోకుండా ఎవ‌రూ బ‌య‌టికి రార‌ని తెలుస్తుంది. సావిత్రి జీవితాన్ని అంత హృద్యంగా తెర‌కెక్కించాడు నాగ్ అశ్విన్. ఇప్ప‌టికే విడుద‌ల‌వుతున్న కీర్తిసురేష్ పోస్ట‌ర్స్ అన్నీ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెంచేస్తున్నాయి. పైగా సినిమా నిండా పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకుని.. ఒకే సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్ చేస్తోన్న మ‌హాయ‌జ్ఞం ఈ మహాన‌టి. మే 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది. సావిత్రి అంద‌రి సొత్తు కాబ‌ట్టి అన్ని చోట్లా సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత మ‌హాన‌టి ఎంత‌మందిని ఏడిపిస్తుందో చూడాలిక‌..!

More Related Stories