English   

మ‌హానటి ప్ర‌మోష‌న్స్ పిచ్చెక్కిస్తున్నారుగా..

Mahanati-Promotions

మౌత్ ప‌బ్లిసిటీ కంటే మించిన పబ్లిసిటీ మ‌రోటి లేదు. మ‌హాన‌టికి ఇది ఎప్పుడో వ‌చ్చేసింది. రెండో రోజు నుంచి సినిమా అద్భుతం అంటూ ప్రేక్ష‌కులే ఒక‌రు ప‌దిమందికి చెబుతున్నారు. ఇప్పుడు వ‌స్తున్న వ‌సూళ్లు కూడా దీనికి నిద‌ర్శ‌నం. ఇప్ప‌టికే 32 కోట్ల షేర్ దాటేసి.. 40 వైపు ప‌రుగు తీస్తుంది మ‌హాన‌టి. మ‌రోవైపు ఓవ‌ర్సీస్ లో కూడా 2.5 మిలియ‌న్ వైపు అడుగేస్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికీ స్ట్రాంగ్ వ‌సూళ్ల‌తో ర‌చ్చ చేస్తుంది మ‌హాన‌టి. ఇంత వ‌సూలు చేసినా కూడా ఇప్ప‌టికీ తాము చేయాల్సిన ప‌ని చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఆప‌కుండా ప్ర‌మోష‌న్స్ దంచేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకు చేయ‌నంత ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నారు మ‌హాన‌టి టీం. సోష‌ల్ మీడియాతో పాటు ఇంట‌ర్వ్యూలు కూడా బోలెడు ఇస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు పెంచుకోడానికి మ‌రో ప్లాన్ వేసింది టీం. ఈ చిత్రాన్ని అక్క‌డ నిర్వాన మూవీస్ విడుద‌ల చేసారు. మూడో వారాంతంలో అంటే మూడో శ‌ని, ఆదివారాలు అక్క‌డ ఫ్రీ షోస్ ఏర్పాటు చేస్తున్నారు. 55 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్లు మ‌హాన‌టిని ఫ్రీగా చూడండి అంటూ ప్ర‌మోట్ చేస్తున్నారు. ఆ రెండు రోజులు ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ ప్ర‌మోష‌న్ దంచేస్తున్నారు. ఇక్క‌డ కూడా ఓ ప్లాన్ ఉంది. వాళ్లు ఫ్రీగా చూడాల‌న్నా కూడా వాళ్ళ‌తో పాటు ఎవ‌రో ఒక‌రు తోడైతే రావాలి క‌దా..! అంటే వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్ అన్న‌మాట‌. మొత్తానికి మ‌హాన‌టి ప్ర‌మోష‌న్స్ చూసి అంతా షాక్ అవుతున్నారిప్పుడు. అన్ని సినిమాల‌కు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు. 

More Related Stories