English   

మ‌హాన‌టి @30 కోట్లు..

Mahanati
2018-05-22 16:07:12

సావిత్రి అంటేనే దాన‌గుణానికి ప్ర‌తీక‌. అప్ప‌ట్లో క‌ర్ణుడు ఎలా ఉంటాడో తెలియ‌దు కానీ సావిత్రిని చూసిన‌పుడు మాత్రం అచ్చంగా అప్ప‌ట్లో ఆ క‌ర్ణుడు కూడా ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది అంటారు ఆమె నుంచి సాయం పొందిన‌వాళ్లు. ఇక ఇప్పుడు ఈమె సాయం అశ్వినీద‌త్ కు కూడా చేసింది. బ‌తికి ఉన్న‌పుడు అంద‌రి క‌ష్టాలు తీర్చిన మ‌హాన‌టి.. ఇప్పుడు చ‌నిపోయిన త‌ర్వాత కూడా అదే కొన‌సాగిస్తుంది. త‌న‌ను న‌మ్మి సినిమా తీసిన అశ్వినీద‌త్ అండ్ ఫ్యామిలీకి కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ రోజు మ‌హాన‌టి చిన్న సినిమాగా మొద‌లైన ప్ర‌యాణం భారీ సినిమాగా మారిపోతుంది. ఒక్కో రోజు గడుస్తుంటే మ‌హాన‌టి వ‌సూళ్లింకా పెరుగుతున్నాయి కానీ త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ఈ చిత్ర ఖాతాలో చాలా రికార్డులు చేరిపోయాయి. ఇక ఇప్పుడు 12 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 30 కోట్ల షేర్.. 55 కోట్ల గ్రాస్ అందుకుంది మ‌హాన‌టి. ఈ చిత్రాన్ని అమ్మింది కేవ‌లం 20 కోట్ల‌కే. అది కూడా తామే సొంతంగా విడుద‌ల చేసుకున్నారు వై జ‌యంతి మూవీస్. దాంతో ఏడేళ్ల త‌మ క‌ష్టాల‌న్నీ ఇప్పుడు మ‌హాన‌టి తీర్చేస్తుంది. ఓవ‌ర్సీస్ లో కాస్త దూకుడు త‌గ్గింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సావిత్రి దూకుడు త‌గ్గ‌డం లేదు. ఈ చిత్రం ఇక్క‌డ ఈజీగా మ‌రో 10 కోట్ల షేర్ రాబ‌ట్టేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే సినిమా 40 కోట్ల షేర్ దాట‌డం ఖాయం. ఈ స‌మ్మ‌ర్ లో రంగ‌స్థ‌లం త‌ర్వాత నెల తిరక్కుండానే తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌హా న‌టి రూపంలో వ‌చ్చింది. 

More Related Stories