English   

మండే ఎండల్లో మహానటి

mahanati-keerthy
2018-03-19 08:59:29

మహానటి అనే పదానికి పర్యాయపదం సావిత్రి. ఆమె తర్వాత ఆ పదానికి సరితూగే నటే మనకు కనిపించదు. అందం, అభినయం కలబోసిన సంపూర్ణ నటి సావిత్రి. వెండితెరపై ఎన్నో రసాల పలికించినా ఆమె జీవితమంతా విషాదమే నిండి ఉంది. కోట్లమందిని ప్రభావితం చేసిన సావిత్రి సొంత జీవితం ఎప్పుడూ సజావుగా సాగలేదు. ఆమె కథ ఓ సినిమా కథను తలపిస్తుంది. అందుకే ఆమె జీవితాన్నే వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడు దర్శకుడు నాగ అన్వేష్. ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రశంసలు అందుకున్న అన్వేష్ ఈ సినిమా కోసం చాలా హోమ్ వర్క్ చేశానని చెబుతున్నాడు.  ఇక మహానటి జీవిత గాథ అనేసరికి సౌత్ మొత్తం ఆసక్తిగా చూసింది. అందుకే అందరికీ తెలిసిన, సావిత్రి మొహానికి, శరీరాకృతికి దగ్గరగా ఉన్న కీర్తి సురేష్ ను సావిత్రిగా తీసుకున్నాడు దర్శకుడు. ఆమె తోటి నటి జమున పాత్రలో సమంత కనిపిస్తుందని చెబుతున్నారు. సావిత్రి భర్త జెమిని గణేశన్ గా మళయాల స్టార్ దుల్కర్ సాల్మన్ నటిస్తున్నాడు. ఎస్వీఆర్ గా మోహన్ బాబు ఓకే అన్నాడు. ప్రకాష్ రాజ్ తో పాటు మరెందరో స్టార్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రకు నటుడు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ అప్పుడే సినిమా విడుదల డేట్ అనౌన్స్ చేసింది టీమ్.

రీసెంట్ గా రిలీజ్ చేసిన మహానటి ఫస్ట్ లుక్ కు అందరూ మెస్మరైజ్ అయిపోయారు. సావిత్రిగా కీర్తి సురేష్ మేకోవర్ అదిరిపోయింది. అయితే ఇంకా ఆర్టిస్టులు దొరకలేదని బయట ఎన్ని వార్తలు వస్తోన్నా టీమ్ మాత్రం కామ్ గా పని చేసుకుపోతోంది. దీన్ని బట్టి ఇప్పటి వరకూ వినిపించినవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. మొత్తంగా సౌత్ మొత్తం ఆసక్తిగా చూస్తోన్న మహానటిని మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది టీమ్. ఉగాది సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఈ విషయం అఫీషియల్ గా కన్ఫార్మ్ చేసింది టీమ్. మే 4న అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా వస్తుంది. ఆ తర్వాత వారమే మండే ఎండల్లో మహానటి రాబోతోంది. ఈ మహానటి బాక్సాఫీస్ వద్ద ఎంత కూల్ గా ఉంటుందో చూడాలి. 

More Related Stories