English   

వామ్మో మ‌హాన‌టి శాటిలైట్ బాంబ్..!

mahanati
2018-05-15 09:01:00

మ‌హాన‌టి.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా ఇదే పేరు. ఒక‌టి రెండు కాదు.. సినిమా వ‌చ్చి ఐదు రోజులు అయినా కూడా ఇప్ప‌టికీ అదే దూకుడు. చిన్న సినిమాగా మొద‌లై.. బాక్సాఫీస్ ను పూర్తిగా ద‌త్త‌త తీసుకుంది అమ్మ‌. ఇప్ప‌టికే ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తుంది. ఈ జోరు ఇంకా ఇలాగే సాగే అవ‌కాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ లోనూ రికార్డ్ సృష్టించింది. జీ నెట్ వ‌ర్క్ ఈ చిత్ర హ‌క్కుల్ని 11 కోట్లకు అమ్ముడ‌య్యాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ఇండ‌స్ట్రీలో. ఈ చిత్రానికి పెట్టిన బ‌డ్జెట్ లో స‌గానికి పైగా ఈ రైట్స్ రూపంలోనే వ‌చ్చాయి. ఇక ఇప్ప‌ట్నుంచీ వ‌చ్చేదంతా ద‌త్ గారికి లాభాలే. త‌మిళ‌నాట కూడా ఈ చిత్రం సూప‌ర్ హిట్ అయింది. అక్క‌డ కూడా మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. 11 కోట్లు అనేది మ‌హాన‌టి లాంటి లో బ‌డ్జెట్ సినిమాకు వ‌ర‌మే. కుదిరింది.. అదిరింది.. అందుకే నిర్మాత‌ల‌కు పండ‌గే పండ‌గ ఇప్పుడు.

More Related Stories