English   

మరికొన్ని గంటల్లో ‘మహానటి’ అసలు రూపం 

Mahanati
2018-04-14 13:28:31

మహానటి.. సావిత్రి బయోపిక్ గా వస్తోన్న సినిమా. కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాలో దక్షిణాదిలోనే పెద్ద ఆర్టిస్టులు చాలామందే నటించారు. తెలుగు నుంచి కూడా కొందరు సర్ ప్రైజింగ్ ఆర్టిస్ట్స్ భాగమైన ఈ మహానటి టీజర్ మరికొన్ని గంటల్లోనే రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అంచనాలు పెంచుతోన్న ఈ టీమ్ ఇప్పుడు టీజర్ తో అసలు తమ రేంజ్ ఎలా ఉండబోతోందో చూపించబోతోంది. సావిత్రిగా కీర్తి సురేష్ ఆ పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయింది. అలాగే సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు మరో హైలెట్ గా ఉండబోతున్నాయని ఇప్పటికే హింట్స్ ఇచ్చేశారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలపై క్లారిటీ లేదు. అది ఈ టీజర్ లో కనిపిస్తుందేమో చూడాలి. ఇక సావిత్రి భర్త, తమిళ నటుడు జెమినీగణేశన్ పాత్రలో మళయాల యంగ్ మెగాస్టార్ దుల్కర్ సాల్మన్ నటించాడు. అతను బేసికల్ గా మంచి నటుడు కూడా. అందుకే ఈ పాత్ర కూడా బాగా రక్తి కట్టవచ్చు. అలాగే ఎస్.వి. రంగారావుగా మోహన్ బాబు నటించాడు. అతనికి వంకలు పెట్టేదేం ఉండదు. మొత్తంగా ఇన్నాళ్లుగా ఊరిస్తోన్న మహానటి విజువల్ గా ఎలా ఉంటుందనే ఊహకు రేపు రూపం రాబోతోంది. ఫస్ట్ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగ అన్వేష్ రెండో సినిమాకే పెద్ద సాహసం చేస్తున్నాడు. ఆసాహసానికి అశ్వనీదత్, అతని కూతుర్లు ఇద్దరూ బ్యాక్ సపోర్ట్ గా నిలిచి మహానటిని నిర్మిస్తున్నారు. సో.. మే 9న విడుదల కాబోతోన్న మహానటి సినిమాకు సంబంధించి అంచనాలు పెంచే ప్రయత్నం రేపటి నుంచే మొదలు కాబోతోందనుకోవచ్చు.

More Related Stories