English   

మ‌హాన‌టి అదిరింది కానీ..

Mahanati-Teaser
2018-04-15 18:13:29

ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న మ‌హాన‌టి టీజ‌ర్ విడుద‌లైంది. కానీ అది నిజంగా అద్భుతంగా ఉందా అంటే మాత్రం స‌మాధానం లేద‌నే చెప్పాలి. ఎందు కంటే ఆ టీజ‌ర్ లో ప్రేక్ష‌కుడు ఊహించింది ఒక‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చూపింది ఒక‌టి. కేవ‌లం కీర్తిసురేష్ పై మాత్ర‌మే ఫోక‌స్ చేసి.. క‌థ‌ను ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. క‌నీసం ఒక్క ట్విస్ట్ కూడా లేకుండా.. డైలాగ్ కూడా లేకుండా సాప్ట్ గా ముగించేసాడు నాగ్ అశ్విన్. అయితే చూడ్డానికి కీర్తిసురేష్ లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమా నిండా పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకుని.. ఒకే సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్ చేస్తోన్న మ‌హాయ‌జ్ఞం ఈ మహాన‌టి. టీజ‌ర్ లో విజువ‌ల్స్ కూడా అదిరిపోవ‌డంతో అంచ‌నాలు భారీగానే పెరిగిపోయాయి. మే 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. మే 11న బెల్లంకొండ శ్రీ‌నివాస్ సాక్ష్యం.. పూరీ జ‌గ‌న్నాథ్ మెహబూబా సినిమాలు రానున్నాయి. అయినా కూడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు మ‌హాన‌టి. దీని వెన‌క బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. క‌థ‌పై వాళ్ల‌కు ఉన్న న‌మ్మ‌కం అలాంటిది. పైగా బిజినెస్ కూడా ఇలాగే జ‌రుగుతుంది సినిమాది. బ‌డ్జెట్ అంతా 22 కోట్లు అయితే శాటిలైట్ రైట్స్ రూపంలోనే అంత మొత్తం వ‌చ్చేసింది నిర్మాత అశ్వినీద‌త్ కు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లోనూ ఈ సినిమా విడుద‌ల కానుంది. సావిత్రి అంద‌రి సొత్తు కాబ‌ట్టి అన్ని చోట్లా సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. మొత్తానికి పెట్టిన బ‌డ్జెట్ అంతా కేవ‌లం శాటిలైట్ రూపంలోనే రావ‌డంతో నిర్మాత అశ్వినీద‌త్ పండ‌గ చేసుకుంటున్నాడు ఇప్పుడు. మ‌రి రేపు విడుద‌లైన త‌ర్వాత మ‌హాన‌టి ఎంత‌మందిని ఏడిపిస్తుందో చూడాలిక‌..!

More Related Stories