English   

సావిత్ర‌మ్మా మ‌జాకా.. రికార్డులే రికార్డులు..!

mahanati-keerthy-suresh
2018-05-14 10:05:49

సావిత్రి జీవితాన్ని తెర‌కెక్కిస్తే ఎవ‌రు చూస్తారు అనుకున్న వాళ్ల‌కు ఇప్పుడు దిమ్మ‌తిరిగిపోయేలా స‌మాధానం ఇచ్చింది మ‌హాన‌టి సినిమా. ఈ చిత్రానికి వ‌స్తున్న వ‌సూళ్ళు చూసి అంతా షాక్ అవుతున్నారు. తొలిరోజు నుంచే అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో పెద్ద సినిమాల‌కు సైతం షాక్ ఇస్తుంది ఈ చిత్రం. ఓవ‌ర్సీస్ లో అయితే ఈ చిత్రం వీకెండ్ లోనే ఏకంగా 1.5 మిలియ‌న్ అందుకుని ఔరా అనిపించింది. ఒక్క యుఎస్ లోనే కాకుండా.. యుకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో కూడా అరాచ‌కం చేస్తుంది అమ్మ సినిమా. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో 2 మిలియ‌న్ దాట‌డం ఖాయమైపోయింది. మొన్న వ‌చ్చిన సినిమాలేవీ మ‌హాన‌టి ముందు నిల‌వడం లేదు. ఇక మొన్న‌టి నా పేరు సూర్య ఇప్ప‌టికే అక్క‌డ చ‌ల్ల‌బ‌డిపోయింది. అన్నింటికి మించి మ‌హాన‌టికి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. అన్నింటికీ మించి సావిత్రి జీవితం కావ‌డంతో కుటుంబాలు క‌దులుతున్నాయి థియేట‌ర్స్ కు. చాలా రోజుల త‌ర్వాత అద్భుతమైన‌ సినిమా చూసామంటూ ప్రేక్ష‌కులు కూడా మ‌న‌సు త‌డుపుకుంటూ థియేట‌ర్స్ నుంచి బ‌య‌టికి వ‌స్తున్నారు. పైగా ఇది సినిమా కాదు.. సెలెబ్రేష‌న్ ఆఫ్ సావిత్రి లైఫ్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఫుల్ ర‌న్ లో ఈ చిత్రం ఈజీగా తెలుగు వ‌ర్ష‌న్ మాత్ర‌మే 30 కోట్ల షేర్ తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే అద్భుత‌మే.

More Related Stories