English   

మ‌హేష్, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్‌

mahesh-allu-arjun

భ‌ర‌త్ అనే నేను.. ఈ స‌మ్మ‌ర్ లో వ‌చ్చిన మ‌హేష్ బాబు బ్లాక్ బ‌స్ట‌ర్.. అంత‌కు ముందు వ‌చ్చిన రంగ‌స్థ‌లం క‌లెక్ష‌న్స్ కు స‌డెన్ గా బ్రేక్ వేయ‌క‌పోయినా.. భ‌ర‌త్ బాక్సాఫీస్ వ‌ద్ద బానే కుమ్మేశాడు. భ‌ర‌త్ త‌ర్వాత వ‌చ్చిన అల్లు అర్జున్ నా పేరు సూర్య భ‌ర‌త్ దూకుడును ఆప‌లేక‌పోయింది. ఈ సినిమాకు విప‌రీత‌మైన ప్ర‌మోష‌న్ కూడా చేశాడు మ‌హేష్ బాబు. అనుకున్న‌ట్టుగానే ఆడియ‌న్స్ తో పాటు క్రిటిక్స్ కూడా భ‌ర‌త్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం భ‌ర‌త్ బాక్సాఫీస్ వ‌ద్ద స్ట‌డీగా ఉంది. కానీ ఇక‌పై ఉండే అవ‌కాశం లేదేమో.. 

లేటెస్ట్ గా వ‌చ్చిన మ‌హాన‌టి భ‌ర‌త్ కు షాక్ ఇచ్చింది. మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ గా వ‌చ్చిన మ‌హాన‌టిపై ఇంత క్రేజ్ ఎవ‌రూ ఊహించ‌లేదు. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ మ‌హాన‌టిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. క‌లెక్ష‌న్స్ కూడా విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో స‌డెన్ గా భ‌ర‌త్ అండ్ నా పేరు సూర్య‌కు క‌లెక్ష‌న్స్ డ్రాప్ అయ్యాయి. ఇది నిజానికి  ఆ చిత్ర నిర్మాత‌లు కూడా ఊహించ‌లేదు. దీంతో కీర్తి సురేష్ దెబ్బ‌కు మ‌హేష్‌, అల్లు అర్జున్ షాక్ తిన్నార‌నే చెప్పాలి. అయితే వీరిలో మ‌హేష్ కొంత వ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ్డట్టే. కానీ అల్లు అర్జున్ నా పేరు సూర్య ఇంకా లాభాల్లోకి (వ‌స్తుంద‌నే గ్యారెంటీ కూడా లేదు)రాలేదు. 

మొత్తంగా ఈ త‌రానికి సావిత్రి గురించి ఏం తెలుసు అన్న‌వారు కూడా ఖంగు తినేలా ఉన్నాయి మ‌హాన‌టి క‌లెక్ష‌న్స్. భారీ తారాగ‌ణం ఉన్నా.. ఫోక‌స్ అంతా కీర్తి సురేష్ (సావిత్రి పాత్ర‌)పైనే పెట్ట‌డంతో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఫిదా అవుతున్నారు. ఎక్క‌డా క‌న్ఫ్యూజ‌న్ లేకుండా స్టోరీ మొద‌లుపెట్ట‌డం నుంచి నెరేష‌న్ వ‌ర‌కూ నాగ్ అశ్విన్ కు ఉన్న క్లారిటీకి కాక‌లు తీరిన ద‌ర్శ‌కులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప‌రిశ్ర‌మ నుంచి నాగీకి విప‌రీత‌మైన ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఆ త‌రాన్నే కాదు.. మ‌హాన‌టి ఈ త‌రాన్ని కూడా అద్భుతంగా ఎంగేజ్  చేసింద‌ని క‌లెక్ష‌న్స్ బ‌ట్టి తెలుస్తోంది. మొత్తంగా మ‌హాన‌టి దెబ్బ‌కు నిన్న‌టి వ‌ర‌కూ కాస్త ఫ‌ర్వాలేద‌నిపించిన భ‌ర‌త్ అనేనేను, నా పేరు సూర్య క‌లెక్ష‌న్స్ త‌గ్గుముఖం ప‌ట్టాయంటోంది ట్రేడ్. మ‌రి మ‌హాన‌టి రేంజ్ ఏంటో తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే.. 
 

More Related Stories