English   

మళ్ళీ రిపీట్ కానున్న మహర్షి కాంబో ?

maharshi
2019-05-23 13:59:09

మహర్షి సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ వెకేషన్ పూర్తయ్యాక ఆయన అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. అయితే మ‌హేష్ వంశీకి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. 2020 వేస‌విలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోందని దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న అతి త్వ‌ర‌లో రాబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మ‌హేష్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో ఓసినిమా చేయ‌బోతున్నాడు. ఆ వెంట‌నే గీత గోవిందం ప‌ర‌శురామ్ సినిమా ప‌ట్టాలెక్కాలి. కానీ మ‌హేష్ ప‌ర‌శురామ్ సినిమాకంటే ముందు వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని అంటున్నారు. తన కోసం మరో మంచి కథను సిద్ధం చేయమని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేయడానికి ఏడాది గ్యాప్ ఇచ్చాడని అంటున్నారు. అనిల్ రావిపూడి సినిమా 2020 సంక్రాంతికి విడుద‌ల అవుతుంది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 2020 వేస‌విలో వంశీ పైడిప‌ల్లి సినిమాని ప‌ట్టాలెక్కిస్తారని సమాచారం.  

More Related Stories