English   

మహేష్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే ?

 Maharshi
2019-04-24 13:19:22

మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, వచ్చేనెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడం వలన ఈ సినిమాని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కాలేజ్  స్టూడెంట్ గా, ఒక అంతర్జాతీయ సంస్థకి సీఈవోగా, రైతుగా ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా ఈరోజు మూడో పాట రిలీజ్ చేయనున్నారు.

More Related Stories