English   

మహేష్ ‘మహర్షి’పై ఫ్లాప్ సెంటిమెంట్ 

Mahesh-Babu-Maharshi
2018-08-11 10:19:21

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా మహర్షి టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. అభిమానులు అదిరిపోయింది అని చెప్పారు. మిగతా ఆడియన్స్ ఏముందీ ఇందులో ఏదో ‘యాడ్ వాక్’ చేసినట్టుగా ఉంది తప్ప.. ఏమాత్రం కొత్తగా లేదు అని పెదవి విరిచారు. మరోవైపు మహేష్ 43యేళ్ల వయసులో కూడా యంగ్ స్టర్ గా కనిపించడం పై మాత్రం యూనానిమస్ గా ప్రశసంలు కురిశాయి. మొత్తంగా ఈ టీజర్ శ్రీమంతుడు, భరత్ అనేనేనులతో పోలిస్తే అంత కిక్ ఇవ్వలేదని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడీ మహర్షిపై కొత్తగా సెంటిమెంటల్ సెటైర్స్ పడుతున్నాయి. ఒకవేళ ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మహర్షి ఫ్లాప్ అవుతుదంతే.
 
మహర్షి అనే సినిమా మనకు కొత్త కాదు. మూడు దశాబ్ధాల క్రితమే ఈ టైటిల్ తో సీనియర్ డైరక్టర్ వంశీ ఓ సినిమా చేశాడు. అప్పటికి అది చాలా కొత్త కథ. ఇదే కథను ఆ తర్వాత తమిళ్ లో ప్రేమిస్తే గా తీశారు. హిట్ అయింది. కానీ అప్పుడు మాత్రం ఆ మహర్షి ఫ్లాప్. పాటలన్నీ సూపర్ హిట్ అయినా సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆ మహర్షి లాగే ఈ మహర్షి కూడా అవుతాడా అనే పోలికలు తెస్తున్నారు కొందరు. వారికి సరిపోయేలా టైటిల్ మాత్రమే కాదు.. దర్శకుడి పేరు కూడా కలిసొస్తుంది. కాకపోతే అప్పుడు హీరో కొత్తవాడు.. ఇప్పుడు హీరోకిది 25వ సినిమా. అలాగే ఈ సినిమాలో హీరో పేరు రిషి.. ఈ పేరుతో వచ్చిన ఓ తెలుగు సినిమా కూడా ఫ్లాప్. బట్ పాయింట్ పరంగా ఈ రిషికి ప్రశంసలున్నాయి. కానీ కమర్షియల్ గా హిట్ అవలేదు. అందుకే మహర్షితో పాటు రిషి కూడా మైనస్సే అంటూ కొందరు అదే పనిగా మహర్షిపై సెంటిమెంటల్ సెటైర్స్ వేస్తున్నారు. అయితే సెంటిమెంట్స్ కు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే నిర్మాతలు కానీ, హీరో కానీ ఈ సెటైర్స్ లేదా కమెంట్స్ పై ఏం సమాధానం చెబుతారో చూడాలి. 

More Related Stories