English   

మ‌హేశ్-సుకుమార్ ఈ సారేంటో..?

Mahesh-26
2018-04-22 13:49:13

మ‌హేశ్ ఇప్పుడిప్పుడే బ్యాడ్ సెంటిమెంట్ల నుంచి బ‌య‌టికి వ‌స్తున్నాడు. ఈయ‌న‌తో రెండో సారి ఏ ద‌ర్శ‌కుడు కూడా హిట్ ఇవ్వ‌డ‌నే సెంటిమెంట్ ను అప్ప‌ట్లో పూరీ జ‌గ‌న్నాథ్ బిజినెస్ మ్యాన్ తో కాస్త స‌డ‌లించాడు. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేనుతో పూర్తిగా ప‌క్క‌కు జ‌రిపేసాడు కొర‌టాల శివ‌. దాంతో క‌థ న‌చ్చితే రెండోసారి ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ కూడా మ‌హేశ్ తో సినిమాకు క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చేసాడు. ఈయ‌న‌తో రెండోసారి ప‌ని చేయ‌బోతున్నాడు. నేనొక్క‌డినే లాంటి ఫ్లాప్ ఇచ్చిన త‌ర్వాత సుకుమార్ ను మ‌రోసారి న‌మ్ముతున్నాడు సూప‌ర్ స్టార్. అయితే ఈ సారి మాత్రం అర్థం కాని క‌థ కాకుండా అర్థ‌మ‌య్యే అంద‌మైన సినిమా చేస్తానంటున్నాడు సుక్కు. ఈయ‌న్ని ఇప్పుడు న‌మ్మొచ్చు ఎందుకంటే రంగ స్థ‌లంతో తానేంటో చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో మ‌హేశ్ కూడా కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ ఎంజాయ్ చేస్తూనే.. వంశీ పైడిప‌ల్లితో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత సుకుమార్ తో సినిమా ఉండ‌బోతుంది. అది కూడా మైత్రి మూవీ మేక‌ర్స్ తోనే. ఇప్ప‌టికే శ్రీ‌మంతుడుతో మ‌హేశ్.. రంగ‌స్థ‌లంతో సుకుమార్ ఆ సంస్థ‌కు బాగా క‌నెక్ట్ అయిపోయారు. ఇప్పుడు రెండోసారి ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు ఆ సంస్థ కోసం. 2019లో సినిమా విడుద‌ల కానుంది

  

More Related Stories