English   

నా ఫుల్ స‌పోర్ట్ మీకే అంటున్న మ‌హేశ్.. 

Mahesh-Geetha-Govindam
2018-08-17 12:37:21

ఒక‌ప్పుడు మ‌నం చూసిన మ‌హేశ్ కు ఇప్పుడు మ‌నం చూస్తున్న మహేశ్ కు చాలా తేడా ఉంది. ఆయ‌న సినిమాలు.. ఆయ‌న కుటుంబం త‌ప్ప మ‌రో సినిమా గురించి పెద్ద‌గా ప‌ట్టించుకునే వాడు కాదు సూప‌ర్ స్టార్. కానీ ఇప్పుడు ఈయ‌న చాలా మారిపోయాడు. త‌న సినిమాతో పాటు కుర్ర హీరోల సినిమాల‌ను కూడా ప‌ట్టించుకుంటున్నాడు. రెగ్యుల‌ర్ గా వ‌చ్చే సినిమాల‌ను ఫాలో అవుతున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా వ‌చ్చిన ప్ర‌తీ సినిమా చూస్తూ.. యంగ్ స్ట‌ర్స్ ను మెచ్చుకుంటున్నాడు. నా ఫుల్ సపోర్ట్ మీకే అంటూ ట్వీట్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు గీత‌గోవిందం విష‌యంలో కూడా ఇదే చేసాడు మ‌హేశ్. సినిమా చూసిన వెంట‌నే ట్వీట్ చేసాడు. 

చాలా బాగుంది.. విజ‌య్ అద‌ర‌గొట్టాడు అంటూ ట్వీటేసాడు ఈ సూప‌ర్ స్టార్. ఈ ట్వీట్ తో మ‌హేశ్ ఫ్యాన్స్ కు కూడా గీత‌గోవిందంపై క్రేజ్ పెరిగింది. ఇక మొన్న గూఢ‌చారి.. చిల‌సౌ సినిమాల‌కు కూడా త‌న‌వంతు స‌పోర్ట్ చేసాడు మ‌హేశ్. చూసిన త‌ర్వాత ఊరికే వ‌దిలేయ‌కుండా వాటిని ట్విట్ట‌ర్ లో ప్ర‌మోట్ కూడా చేసాడు మ‌హేశ్ బాబు. ఆమ‌ధ్య బావ న‌టించిన స‌మ్మోహ‌నం సినిమాకు కూడా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయాడు మ‌హేశ్. మొత్తానికి ఇప్పుడు యంగ్ స్టర్స్ కు ఈయ‌న వ‌రంలా మారాడు. మ‌హేశ్ మెప్పు పొందితే చాలు.. థియేట‌ర్స్ కు వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌న‌వంతు సాయం చేస్తూనే ఉన్నాడు ఈ సూప‌ర్ స్టార్. ఈయ‌న చేస్తోన్న సాయం చిన్న‌దే అయినా కూడా చిన్న సినిమాల‌కు క‌లెక్ష‌న్లు పెంచ‌డంలో అదే యూజ్ అవుతుంది కూడా. 

More Related Stories