English   

మహేష్ బాబు 25వ సినిమా ఆగిపోతుందా..?

mahesh babu

మహేష్ బాబు 25వ సినిమా ఆగిపోతోందా..? మహేష్ 25వ సినిమా కథే కాదు, దర్శకుడూ మారబోతున్నాడా..? అంటే అవుననే వినిపిస్తోంది. కారణం. అతను చేయబోయే సినిమా స్క్రిప్ట్ ఇప్పుడు కోర్ట్ లో ఉంది. స్క్రిప్ట్ కోర్ట్ కు ఎలా వెళుతుంది అనుకుంటున్నారా..? కొన్నిసార్లు వెళుతుంది. ఇంకా చెప్పాలంటే కోర్ట్ నుంచి ఈ మూవీ టీమ్ లో చాలామందికి నోటీస్ లు కూడా వెళ్లాయట. సో మహేష్ నెక్ట్స్ మూవీ ఏంటీ..?కొన్ని గొడవలు చల్లారినట్టుగా కనిపిస్తాయి. కానీ అదను చూసి భగ్గుమంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాత పివిపి, దర్శకుడు వంశీ పైడిపల్లల ఇష్యూ కూడా ఇలాంటిదే. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివతో భరత్ అనేనేను సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత తన కెరీర్ లో 25వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మేరకు స్క్రిప్ట్ కూడా ఎప్పుడో ఫైనల్ అయింది. ఈ భారీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు- అశ్వనీదత్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ కాబోతోన్న సమయంలో పివిపి సంస్థ వక్కంతం కు షాక్ ఇచ్చింది. ఈ కొత్త సినిమా స్క్రిప్ట్ పై పూర్తి హక్కులు మావే అంటూ కోర్ట్ కెక్కారు. నిజానికి ఈ గొడవ రెండేళ్లుగా నడుస్తోంది. అప్పట్లో ఈ కథను పివిపి తెరకెక్కిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ అతనికీ వక్కంతం వంశీకి మనస్పర్థలు వచ్చాయి. ఇందులో మహేష్ బాబు మనసు కూడా ఉందనేది అందరికీ తెలిసిన విషయం. దీంతో అదే స్క్రిప్ట్ తో మహేష్ బాబును ఒప్పించారు. దీనికి దిల్ రాజు- అశ్వనీదత్ నిర్మాతలుగా ముందుకు వచ్చారు. ఆ టైమ్ లో ఈ కాంబినేషన్ కు పివిపి ఓకే చెప్పినట్టే కనిపించారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగినట్టు టాక్. ఇక స్క్రిప్ట్ కోర్ట్ లో ఉంది కాబట్టి కోర్ట్ తీర్పును బట్టే నెక్ట్స్ స్టెప్ ఉంటుంది.

ఒకవేళ కోర్ట్ తీర్పు పివిపికి అనుకూలంగా వస్తే వక్కంతం బుక్ అవుతాడు. మహేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాడు. లేదంటే అంతా హ్యాపీస్. కానీ ఇంత వరకూ వచ్చిన ఈ మేటర్ ను పెద్దలు సెటిల్ చేయకుండా ఉండరు కదా..? కాదూ కూడదు అంటే మరి మహేష్ బాబు 25వ సినిమా ఎవరితో ఉంటుంది.. ?ఈ ప్రశ్నకు సమాధానం అంత త్వరగా వస్తుందనుకోలేం. ఎందుకంటే అప్పట్లో త్రివిక్రమ్ తో అని వినిపించింది. కానీ ఆయనిప్పుడు ఎన్టీఆర్ సినిమాతో బిజీ. రాజమౌళితోనూ కుదరదు. మహేష్ ఇమేజ్ కు భిన్నంగా వెళ్లే బోయపాటి కూడా బిజీనే. సో.. ఆ సినిమా నిజంగానే ఆగిపోతే మహేష్ బాబు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో వెళ్లినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారానికి ఫినిషింగ్ ట్విస్ట్ ఏంటంటే.. అసలు నిజంగానే ఈ స్క్రీప్ట్ కోర్ట్ లో ఉందా లేక ఇదేమైనా రూమరా అని.

More Related Stories